శీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో లాభాలతో మొదలైనా మార్కెట్లు చివర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 26,242 వద్ద , నిఫ్టీ 21 పాయింట్లు తగ్గి 8,061 వద్ద ముగిశాయి. ఇది నెల రోజుల కనిష్టం. నిఫ్టీ 8100 కు మరింత దిగువన ముగిసినా 8050 స్థాయిని పైన ప్రస్తుతానికి స్థిరపడింది. రియల్టీ, మెటల్ సెక్టార్లు తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, మీడియా రంగాలు నీరసించాయి. ఇన్‌ఫ్రాటెల్, సన్ ఫార్మా, ఐటీసీ, ఐడియా, అంబుజా సిమెంట్, జీ, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటో, యాక్సిస్ బ్యాంక్, అరబిందో భారీ పతనాన్ని నమోదు చేయగా, అల్ట్రాటెక్, లుపిన్, ఎన్‌టీపీసీ, మారుతీ, ఇండస్‌ఇండ్, హిందాల్కో, ఓఎన్‌జీసీ, బీవోబీ, ఐషర్, పవర్‌గ్రిడ్ స్వల్పంగా లాభపడ్డాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి ఈరోజు బలపడింది. 13 పైసలు లాభపడి రూ.67.91వద్ద ఉంది. పసిడికూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతోంది.రూ.115 క్షీణించిన పుత్తడి పది గ్రా.రూ.27,115గా ఉంది.