పశ్చిమగోదావరి: జిల్లాలో ప్రభుత్వం నిర్మించనున్న ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధిత గ్రామాల్లో వైయస్ఆర్ సీపీ నేతల బృందం బుధవారం పర్యటించనుంది. ఈ మేరకు వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. మాజీ మంత్రులు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఈ బృందంలో ఉన్నట్లు తెలిపారు.
మెగా ఆక్వాఫుడ్ గ్రామాల వాస్తవ పరిస్ధితులను తెలుసుకునేందుకే నేతల బృందం ఈ పర్యటన చేయనున్నట్లు వెల్లడించారు. ఆక్వాఫుడ్ గ్రామాల ప్రజల అంగీకారంతోనే ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువు గ్రామల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని అన్నారు.
ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైయస్ఆర్సీపీ బృందం పర్యటన
Published Tue, Oct 4 2016 10:28 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement