దేవనకొండ (కర్నూలు జిల్లా): పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్రేమ పాఠాలు చెబుతుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులకు మాకొద్దు ఈ టీచర్లు అని చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో జరిగింది. ఈ పాఠశాలలో 713 మంది విద్యార్థులుండగా 21 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. కాగా, వీరిలో ఎక్కువ మంది ప్రేమ పాఠాలే చెబుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
దీంతో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని మాకొద్దు ఈ ఉపాధ్యాయులు అంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన డీఈవో సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హామి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
ఆ పాఠాలు చెప్పే టీచర్లు మాకొద్దు..
Published Wed, Aug 5 2015 4:15 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement