love lessons
-
ఆ పాఠాలు చెప్పే టీచర్లు మాకొద్దు..
దేవనకొండ (కర్నూలు జిల్లా): పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్రేమ పాఠాలు చెబుతుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులకు మాకొద్దు ఈ టీచర్లు అని చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో జరిగింది. ఈ పాఠశాలలో 713 మంది విద్యార్థులుండగా 21 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. కాగా, వీరిలో ఎక్కువ మంది ప్రేమ పాఠాలే చెబుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని మాకొద్దు ఈ ఉపాధ్యాయులు అంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన డీఈవో సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హామి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
విద్యార్థులకు టీచర్ ప్రేమపాఠాలు!
విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ గాడి తప్పింది. పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు చెప్పడం వివాదానికి కారణమైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొండపి గురుకుల పాఠశాలల్లో కలకలరేపుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు టీచర్ .. 8వ తరగతి విద్యార్థినులకు ప్రేమలు పాఠాలు బోధించింది. ఈ విషయం కాస్తా ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో సదరు టీచర్ను నిలదీశాడు. దీంతో మనసు నొచ్చుకున్న ఆ టీచర్, ప్రధానోపాధ్యాయుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థులను విచారించిన పోలీసులకు.. ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు చెప్పినట్లు తెలిసింది. విద్యార్థులే ప్రేమికుల దినోత్సం ప్రస్తావన తేవడంతో ప్రేమ గురించి మాట్లాడానంటోంది ఉపాధ్యాయురాలు. -
ప్రేమ పేరుతో వంచించిన టీచర్
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారితప్పి ప్రవర్తించాడు. చదువు చెప్పడం మాని ప్రేమ పాఠాలు బోధించాడు. కీచక టీచర్ మాటలను నమ్మి ఓ విద్యార్థిని మోసపోయింది. వరంగల్ జిల్లాలోని చేర్యాలలో ఓ కీచక టీచర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వంచించి మోసానికి పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ డిగ్రీ కాలేజీ లెక్చరర్ రామకృష్ణారెడ్డిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.