విద్యార్థులకు టీచర్ ప్రేమపాఠాలు!
విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ గాడి తప్పింది. పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు చెప్పడం వివాదానికి కారణమైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొండపి గురుకుల పాఠశాలల్లో కలకలరేపుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు టీచర్ .. 8వ తరగతి విద్యార్థినులకు ప్రేమలు పాఠాలు బోధించింది.
ఈ విషయం కాస్తా ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో సదరు టీచర్ను నిలదీశాడు. దీంతో మనసు నొచ్చుకున్న ఆ టీచర్, ప్రధానోపాధ్యాయుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థులను విచారించిన పోలీసులకు.. ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు చెప్పినట్లు తెలిసింది. విద్యార్థులే ప్రేమికుల దినోత్సం ప్రస్తావన తేవడంతో ప్రేమ గురించి మాట్లాడానంటోంది ఉపాధ్యాయురాలు.