ఎవరి తప్పు ఎంత? | chandrababu naidu spreading lies over krishna water | Sakshi
Sakshi News home page

ఎవరి తప్పు ఎంత?

Published Tue, Dec 3 2013 5:13 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

ఎవరి తప్పు ఎంత? - Sakshi

ఎవరి తప్పు ఎంత?

  • నాడు నిద్రపోయి... నేడు వైఎస్‌పై నిందలేస్తున్న చంద్రబాబు
  •  1995-2004 మధ్య తన హయాంలో కర్ణాటక ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోని బాబు
  • కృష్ణా మిగులు జలాలు రాష్ట్రానికి దక్కకుండా చేసే, ఆ రకంగా ఉభయ ప్రాంతాల మధ్య వివాదం తలెత్తకుండా.. రాష్ట్ర విభజనకు సహకరించేలా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్  ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా.. తన దాడిని చనిపోయిన రాజశేఖరరెడ్డిపై కేంద్రీకరించడం ఓ వింత. ఈ వింతలో.. తాను అధికారంలో ఉండగా నిద్రపోవడమే కాకుండా, ఈ దారుణానికి తానే కారణమన్న నిజాన్ని దాచేందుకు కూడా బాబు ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో కర్ణాటక చేపట్టిన ఆలమట్టిలాంటి ప్రాజెక్టులను బాబు అడ్డుకోలేకపోయూరు. రాష్ట్రంలో తాను ఎలాంటి ప్రాజెక్టులూ చేపట్టకపోగా ఎన్టీఆర్ ప్రభుత్వం పిలిచిన టెండర్లు సైతం రద్దు చేశారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలోనే అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా రూ.వేల కోట్లు వెచ్చించారు. నాటి చంద్రబాబు నిర్వాకాలు, ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ పడిన తపనపై సాక్షి కథనం..
     
    సాక్షి, హైదరాబాద్: ‘ఫస్ట్ ఇన్ టైమ్, ఫస్ట్ ఇన్ రైట్’.... ఈ అమెరికన్ చట్ట స్ఫూర్తిని ఎక్కడైనా జలవివాదాలకు సంబంధించి ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. వినియోగంలో ముందున్నవారికి హక్కులోనూ ప్రాధాన్యతముంటుందని దీని అర్థం. కృష్ణా జలాలపై ఏర్పడిన బచావత్ ట్రిబ్యునల్ సహా దేశంలోని వివిధ ట్రిబ్యునళ్లు ఈ మేరకే వ్యవహరించాయి. ఒక నదిపై ముందే ప్రాజెక్టులు కట్టుకుని వాటి ఆధారంగా జీవిస్తున్న ప్రజలకు ముందుగా రక్షణ కల్పించాలన్నదే ఆ సూత్రంలోని పరమార్థం.

    ఆ విధంగానే 1973లో బచావత్ అప్పటికే నీటిని వినియోగించుకుంటున్న ప్రాజెక్టులను అనుమతించారు. కొత్త ట్రిబ్యునల్ కూడా అదే తీరున వ్యవహరిస్తుందనే వాస్తవాన్ని మనకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు బాగా గ్రహించాయి. అందుకే బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసే 2000 లోపు కొత్త ట్రిబ్యునల్ ఏర్పడిన 2004 లోపు అనేక ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించుకున్నాయి. అప్పట్లో రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు  ఇదేమీ పట్టలేదు. ప్రాజెక్టులను గాలికొదిలేశారు.

    కృష్ణా మిగులు జలాల వినియోగంపై మనకున్న స్వేచ్ఛను కాపాడుకోవటానికి  ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపక్షాల డిమాండ్లను కూడా తేలికగా తీసుకున్నారు. ఫలితం.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి శరాఘాతం వంటి తీర్పునిచ్చింది. ఈ శాపానికి ప్రధానకారకుడైన చంద్రబాబు వూత్రం యథావిధిగా ప్రజలను మభ్య పెట్టేందుకు దీనికీ వైఎస్ రాజశేఖరరెడ్డే కారకుడంటూ ఓ విచిత్రవాదనను ఎత్తుకున్నారు. లేఖలకూ, దీక్షలకూ దిగుతున్నారు!
     
    కర్ణాటక ముందుచూపు.. బాబు వెనుకచూపు
    కర్ణాటక 2004 నాటికల్లా తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు 1996లోనే కర్ణాటక సాగునీటి సంస్థ (నీరావరి నిగమ లిమిటెడ్) ఏర్పాటు చేసింది. కృష్ణా నదిపై నారాయణపూర్, ఆలమట్టి వంటి వందల టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులన్నింటికీ విరివిగా నిధులిచ్చింది. కేంద్రం నుంచీ నిధులు సాధించింది. నిధుల కొరత కారణంగా ప్రాజెక్టులు ఆగరాదని ప్రజలకు బాండ్లు జారీచేసి, నిధులు సమీకరించి వురీ ప్రాజెక్టుల్ని వేగంగా నిర్మించుకుంది. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టింది, పూర్తి చేసింది కూడా. 1995-2004 మధ్య, అంటే మన రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లోనే కావడం గమనార్హం. కర్ణాటక 2005, ఆ తర్వాత కూడా ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం, చిన్నాచితకా ప్రాజెక్టుల్ని చేపట్టటం జరిగింది.  2004 నాటికే దాదాపుగా ఆ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, నీటి నిల్వ పథకాలన్నీ పూర్తయ్యాయి. తన ఇల్లు చక్కబెట్టుకున్న కర్ణాటక ఇంకోవైపు ప్రాజెక్టులు కట్టకుండా మన రాష్ట్రాన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ చంద్రబాబు ఆ విలువైన సవుయుంలో కర్ణాటకలో ప్రాజెక్టులను ఆపలేకపోయారు. కనీసం మన రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలేకపోయారు. కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునేందుకు ఉద్దేశించిన హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, తెలుగుగంగ ప్రాజెక్టులను 2004 నాటికి పూర్తిచేసి ఉంటే వీటన్నింటికీ తప్పకుండా హక్కు దక్కి ఉండేది. కర్ణాటక, వుహారాష్ట్ర నిర్మించుకున్న ప్రాజెక్టుల సావుర్థ్యాన్ని, వాటి ఎత్తును బ్రిజేశ్‌కువూర్ ట్రిబ్యునల్ సవుర్థించడమే ఇందుకు నిదర్శనం.
     
    చంద్రబాబు నిర్వాకానికి ఇవే సాక్ష్యాలు!
    హంద్రీ-నీవాసుజల స్రవంతి
    ఇది తరచుగా కరువువాత పడే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగునీటి సదుపాయం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టు. 1998 మే నెలలో పరిపాలక అనుమతి లభించింది. కానీ ఐదేళ్లకు 2003-04 బడ్జెట్‌లో చంద్రబాబు కేవలం రూ.14 కోట్లు కేటాయించారు. ఇవి పరిపాలన వ్యయూనికే సరిపోలేదు.
     
    వెలిగొండ
    ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాల సాగుకు, 29 మండలాల్లోని 15 లక్షల మందికి తాగునీటికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను మళ్లించాల్సి ఉంటుంది. 1995 నవంబర్‌లోనే కేంద్ర జలమండలికి ప్రాజెక్టు రిపోర్టు సమర్పించారు. దీనికి 2003-04లో రూ.5 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు సిబ్బంది జీతభత్యాలకూ ఇవి చాలలేదు.
     
    కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
    మహబూబ్‌నగర్ జిల్లాలో 25 టీఎంసీల నీటితో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 3.2 లక్షల మందికి తాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు అంచనాలను 2002 ఆగస్టులో సమర్పించారు. 14.05.2003న జీవో నెంబరు 65తో రూ.1500 కోట్ల అంచనా వ్యయానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. 2003-04లో ఏఐబీపీ (ఏక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం) నిధుల కింద కేవలం రూ.15 కోట్లు, బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించారు.
     
    నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
    మహబూబ్‌నగర్ జిల్లాలో 2 లక్షల ఎకరాల సాగునీరు, 148 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 20 టీఎంసీలు అవసరమని అంచనా. 1997 డిసెంబరులో ప్రాజెక్టు రూపకల్పనకు రూ. 5 కోట్లు కేటాయించింది. అక్టోబరు 2000లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించారు. 12.11.03న మరో నివేదిక సమర్పించారు. 2003-04 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 5 కోట్లు కేటాయించారు.
     
    తెలుగు గంగ
    29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాల వినియోగంతో కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడు అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. 2004 నాటికి రూ.1758 కోట్లు ఖర్చు చేశారు. 2004 నాటికి ఇంకా రూ.1342 కోట్ల పనులు మిగిలే ఉన్నాయి.
     
    వైఎస్ చెప్పినా పట్టించుకోని బాబు!
    ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకతను తెలియజేసే ప్రయత్నం చేశారు. తద్వారా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని భావించారు. అయినప్పటికీ నాటి చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరవలేదు. కనీసం బాబు హయూంలోనే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులనైనా చేపట్టాలని వైఎస్ కోరారు. కానీ చంద్రబాబు నాడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలతోనే సరిపుచ్చారు. అంతకుమించిన దారుణం ఏమిటంటే గతంలో దూరదృష్టితో ఎన్టీఆర్ చేపట్టిన ప్రాజెక్టులను సైతం పక్కనపెట్టేశారు. ఎన్టీఆర్ హయూంలో పిలిచిన టెండర్లను కూడా రద్దు చేయడం సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement