Brijesh tribunal judgment
-
మళ్లీ తెరపైకి ‘దుమ్ముగూడెం’
మిర్యాలగూడ, న్యూస్‌లైన్:కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం పేరుతో కృష్ణానది మిగులు జలాల్లో కోత విధించే ప్రయత్నం మొదలైంది. ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ తీర్పు ప్రకారం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో 145 టీఎంసీల నీటిని వచ్చే ఏడాదికి నిల్వ చేసుకోవాలి. దీంతో మిగులు జలాల ఆధారంగా నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీకి చుక్కనీరు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రాజెక్ట్ టెక్నికల్ కమిటీ నిర్ణయం మేరకు 2018 లోగా ప్రాజెక్ట్ పూర్తికి ప్రభుత్వం గడువు పొడిగించింది. దీంతో నల్లగొండ జిల్లా ప్రజల్లో మళ్లీ అలజడి మెదలైంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో అదనంగా ఒక్క ఎకరానికి నీరు రాక పోగా, భూసేకరణ కోసం పంట భూములు కోల్పోవలసి వస్తుంది. దుమ్ముగూడెం-టెయిల్పాంట్ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉందంటూ టెక్నికల్ కమిటీ పేర్కొనడం కృష్ణా జలాల్లో కోత విధించడానికే అని స్పష్టంగా తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గతంలో రూ. 19,521 కోట్లకు అంచనా వేయగా, ప్రస్తుతం అది సుమారు రూ. 30 వేల కోట్లకు చేరింది. వాస్తవానికి 2009లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించగా, నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అప్పటి సీఎం రోశయ్యను కలిశారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఇదే సమయంలో 2014లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలనే గడువు దగ్గరికి వచ్చింది. దీంతో టెక్నికల్ కమిటీ సూచనల మేరకు ఇటీవల ప్రాజెక్టు నిర్మాణ గడువు 2018 సంవత్సరానికి పెంచారు. ఎత్తిపోతలు సాధ్యమయ్యేనా? దుమ్ముగూడెం ప్రాజెక్టు భాగంగా ఖమ్మం జిల్లా బయ్యారం నుంచి నాగార్జునసాగర్ దిగువన నల్లగొండ జిల్లాలోని హాలియా సమీపంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులోకి లింకు కాలువ ను ఏర్పాటు చేయాలి. దీని కోసం 244 కిలోమీటర్ల పొడువునా కాల్వ తవ్వకం పనులు చేపట్టాలి. అంతే కాకుండా మొత్తం 127 మీటర్ల ఎత్తులో ఎత్తిపోతల పథకాలు పనిచేయాల్సి ఉంది. అందుకు 1,136 మెగావాట్ల విద్యుత్ కూడా అవసరమవుతుంది. ఖమ్మం జిల్లాలోని మొద్దులగూడెం (19 మీటర్ల ఎత్తు), కళ్యాణపురం (16 మీటర్ల ఎత్తు), రేగల్ల (25 మీటర్ల ఎత్తు), ఒడ్డుగూడెం (12 మీటర్ల ఎత్తు), కోయగూడెం (19 మీటర్ల ఎత్తు), బయ్యారం వద్ద 35 మీటర్ల ఎత్తున ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నిర్మించే ఎత్తిపోతల పథకాలు పని చేసే పరిస్థితులు లేవు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భూసేకరణ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువ తవ్వకానికి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో 3,701 ఎకరాల అటవీభూమి, 16,084 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ పనులను 10 ప్యాకేజీలుగా విభజించారు. ఖమ్మం జిల్లాలో 1 నుంచి 6 ప్యాకేజీలు (159.80 కిలోమీటర్లు), నల్లగొండ జిల్లాలో 7 నుంచి 10వ ప్యాకేజీ వరకు 84 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. కాగా, ఖమ్మం జిల్లాలోని బయ్యారం నుంచి ప్రారంభమవుతున్న ఈ లింకు కాలువ బయ్యారం, గార్ల, తిమ్మాయిపాలెం మీదుగా నల్లగొండ జిల్లాలోని మోతె మండలానికి ప్రవేశించి అక్కడి నుంచి చివ్వెంల, మునగాల, పెన్‌పహాడ్, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, అనుముల మీదుగా టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో కలుస్తుంది. సాగర్ ఆయకట్టును దీని పరిధిలో చూపేందుకు ప్రయత్నం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువభాగంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో ఈ లింకు కాలువను కలిపినా, దాని పరిధిలోని ఆయకట్టు పూర్తిగా దీని కిందనే ఉన్నట్లు టెక్నికల్ కమిటీ చూపేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలున్నాయి. టెయిల్‌పాండ్ వద్ద ఉన్న రివర్సబుల్ టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ఆయకట్టుకు నీటిని వినియోగించుకోవచ్చని వారి లెక్కల్లో పేర్కొన్నారు. వరదల సమయంలోనే కేవలం 80రోజుల్లో మాత్రమే నీటిని మళ్లించే అవకాశముండే ఈ ప్రాజెక్టు పరిధిలోకి 14,12,870 ఎకరాల ఆయకట్టు చూపిస్తున్నారు. టెక్నికల్ కమిటీ సూచనల మేరకు తెలంగాణ ప్రాంతంలో 8,53,870 ఎకరాలు (ఖమ్మం జిల్లాలో 2,05,200 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 3,68,070 ఎకరాలు (ఎడమకాల్వ పరిధి), నల్లగొండ జిల్లాలో 2,80600 ఎకరాలు), ఆంధ్రా ప్రాంతంలో 5,59,000 ఎకరాలు (గుంటూరు జిల్లాలో 3,40,000 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 2,19,000 ఎకరాలు ఆయకట్టును చూపుతున్నారు. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సాగుకు ఈ నీరు ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు లేవు. ప్రాజెక్టుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: జూలకంటి రంగారెడ్డి, ఎమెల్యే మిర్యాలగూడ దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాకు ఎలాంటి ఉపయోగం లేదు. పనులు నిలిపివేయాలని గతంలోనే అప్పటి సీఎం రోశయ్యకు వినతిపత్రం ఇచ్చాం. ఇటీవల సీఎం కిరణ్‌ను కూడా కలిశాం. ఈ ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో టెక్నికల్ కమిటీ చెప్పిన విషయాలను ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి. ప్రజలు అడిగిన ప్రాజెక్టులను నిర్మించని ప్రభుత్వం అవసరం లేని దానిని నిర్మించే ప్రయత్నం విరమించుకోవాలి. -
ఎవరి తప్పు ఎంత?
నాడు నిద్రపోయి... నేడు వైఎస్‌పై నిందలేస్తున్న చంద్రబాబు 1995-2004 మధ్య తన హయాంలో కర్ణాటక ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోని బాబు కృష్ణా మిగులు జలాలు రాష్ట్రానికి దక్కకుండా చేసే, ఆ రకంగా ఉభయ ప్రాంతాల మధ్య వివాదం తలెత్తకుండా.. రాష్ట్ర విభజనకు సహకరించేలా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా.. తన దాడిని చనిపోయిన రాజశేఖరరెడ్డిపై కేంద్రీకరించడం ఓ వింత. ఈ వింతలో.. తాను అధికారంలో ఉండగా నిద్రపోవడమే కాకుండా, ఈ దారుణానికి తానే కారణమన్న నిజాన్ని దాచేందుకు కూడా బాబు ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో కర్ణాటక చేపట్టిన ఆలమట్టిలాంటి ప్రాజెక్టులను బాబు అడ్డుకోలేకపోయూరు. రాష్ట్రంలో తాను ఎలాంటి ప్రాజెక్టులూ చేపట్టకపోగా ఎన్టీఆర్ ప్రభుత్వం పిలిచిన టెండర్లు సైతం రద్దు చేశారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలోనే అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా రూ.వేల కోట్లు వెచ్చించారు. నాటి చంద్రబాబు నిర్వాకాలు, ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ పడిన తపనపై సాక్షి కథనం.. సాక్షి, హైదరాబాద్: ‘ఫస్ట్ ఇన్ టైమ్, ఫస్ట్ ఇన్ రైట్’.... ఈ అమెరికన్ చట్ట స్ఫూర్తిని ఎక్కడైనా జలవివాదాలకు సంబంధించి ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. వినియోగంలో ముందున్నవారికి హక్కులోనూ ప్రాధాన్యతముంటుందని దీని అర్థం. కృష్ణా జలాలపై ఏర్పడిన బచావత్ ట్రిబ్యునల్ సహా దేశంలోని వివిధ ట్రిబ్యునళ్లు ఈ మేరకే వ్యవహరించాయి. ఒక నదిపై ముందే ప్రాజెక్టులు కట్టుకుని వాటి ఆధారంగా జీవిస్తున్న ప్రజలకు ముందుగా రక్షణ కల్పించాలన్నదే ఆ సూత్రంలోని పరమార్థం. ఆ విధంగానే 1973లో బచావత్ అప్పటికే నీటిని వినియోగించుకుంటున్న ప్రాజెక్టులను అనుమతించారు. కొత్త ట్రిబ్యునల్ కూడా అదే తీరున వ్యవహరిస్తుందనే వాస్తవాన్ని మనకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు బాగా గ్రహించాయి. అందుకే బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసే 2000 లోపు కొత్త ట్రిబ్యునల్ ఏర్పడిన 2004 లోపు అనేక ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించుకున్నాయి. అప్పట్లో రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు ఇదేమీ పట్టలేదు. ప్రాజెక్టులను గాలికొదిలేశారు. కృష్ణా మిగులు జలాల వినియోగంపై మనకున్న స్వేచ్ఛను కాపాడుకోవటానికి ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపక్షాల డిమాండ్లను కూడా తేలికగా తీసుకున్నారు. ఫలితం.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి శరాఘాతం వంటి తీర్పునిచ్చింది. ఈ శాపానికి ప్రధానకారకుడైన చంద్రబాబు వూత్రం యథావిధిగా ప్రజలను మభ్య పెట్టేందుకు దీనికీ వైఎస్ రాజశేఖరరెడ్డే కారకుడంటూ ఓ విచిత్రవాదనను ఎత్తుకున్నారు. లేఖలకూ, దీక్షలకూ దిగుతున్నారు! కర్ణాటక ముందుచూపు.. బాబు వెనుకచూపు కర్ణాటక 2004 నాటికల్లా తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు 1996లోనే కర్ణాటక సాగునీటి సంస్థ (నీరావరి నిగమ లిమిటెడ్) ఏర్పాటు చేసింది. కృష్ణా నదిపై నారాయణపూర్, ఆలమట్టి వంటి వందల టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులన్నింటికీ విరివిగా నిధులిచ్చింది. కేంద్రం నుంచీ నిధులు సాధించింది. నిధుల కొరత కారణంగా ప్రాజెక్టులు ఆగరాదని ప్రజలకు బాండ్లు జారీచేసి, నిధులు సమీకరించి వురీ ప్రాజెక్టుల్ని వేగంగా నిర్మించుకుంది. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టింది, పూర్తి చేసింది కూడా. 1995-2004 మధ్య, అంటే మన రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లోనే కావడం గమనార్హం. కర్ణాటక 2005, ఆ తర్వాత కూడా ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం, చిన్నాచితకా ప్రాజెక్టుల్ని చేపట్టటం జరిగింది. 2004 నాటికే దాదాపుగా ఆ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, నీటి నిల్వ పథకాలన్నీ పూర్తయ్యాయి. తన ఇల్లు చక్కబెట్టుకున్న కర్ణాటక ఇంకోవైపు ప్రాజెక్టులు కట్టకుండా మన రాష్ట్రాన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ చంద్రబాబు ఆ విలువైన సవుయుంలో కర్ణాటకలో ప్రాజెక్టులను ఆపలేకపోయారు. కనీసం మన రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలేకపోయారు. కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునేందుకు ఉద్దేశించిన హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, తెలుగుగంగ ప్రాజెక్టులను 2004 నాటికి పూర్తిచేసి ఉంటే వీటన్నింటికీ తప్పకుండా హక్కు దక్కి ఉండేది. కర్ణాటక, వుహారాష్ట్ర నిర్మించుకున్న ప్రాజెక్టుల సావుర్థ్యాన్ని, వాటి ఎత్తును బ్రిజేశ్‌కువూర్ ట్రిబ్యునల్ సవుర్థించడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు నిర్వాకానికి ఇవే సాక్ష్యాలు! హంద్రీ-నీవాసుజల స్రవంతి ఇది తరచుగా కరువువాత పడే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగునీటి సదుపాయం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టు. 1998 మే నెలలో పరిపాలక అనుమతి లభించింది. కానీ ఐదేళ్లకు 2003-04 బడ్జెట్లో చంద్రబాబు కేవలం రూ.14 కోట్లు కేటాయించారు. ఇవి పరిపాలన వ్యయూనికే సరిపోలేదు. వెలిగొండ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాల సాగుకు, 29 మండలాల్లోని 15 లక్షల మందికి తాగునీటికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను మళ్లించాల్సి ఉంటుంది. 1995 నవంబర్లోనే కేంద్ర జలమండలికి ప్రాజెక్టు రిపోర్టు సమర్పించారు. దీనికి 2003-04లో రూ.5 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు సిబ్బంది జీతభత్యాలకూ ఇవి చాలలేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మహబూబ్‌నగర్ జిల్లాలో 25 టీఎంసీల నీటితో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 3.2 లక్షల మందికి తాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు అంచనాలను 2002 ఆగస్టులో సమర్పించారు. 14.05.2003న జీవో నెంబరు 65తో రూ.1500 కోట్ల అంచనా వ్యయానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. 2003-04లో ఏఐబీపీ (ఏక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం) నిధుల కింద కేవలం రూ.15 కోట్లు, బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మహబూబ్‌నగర్ జిల్లాలో 2 లక్షల ఎకరాల సాగునీరు, 148 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 20 టీఎంసీలు అవసరమని అంచనా. 1997 డిసెంబరులో ప్రాజెక్టు రూపకల్పనకు రూ. 5 కోట్లు కేటాయించింది. అక్టోబరు 2000లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించారు. 12.11.03న మరో నివేదిక సమర్పించారు. 2003-04 బడ్జెట్లో ఈ పథకానికి రూ. 5 కోట్లు కేటాయించారు. తెలుగు గంగ 29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాల వినియోగంతో కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడు అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. 2004 నాటికి రూ.1758 కోట్లు ఖర్చు చేశారు. 2004 నాటికి ఇంకా రూ.1342 కోట్ల పనులు మిగిలే ఉన్నాయి. వైఎస్ చెప్పినా పట్టించుకోని బాబు! ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకతను తెలియజేసే ప్రయత్నం చేశారు. తద్వారా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని భావించారు. అయినప్పటికీ నాటి చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరవలేదు. కనీసం బాబు హయూంలోనే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులనైనా చేపట్టాలని వైఎస్ కోరారు. కానీ చంద్రబాబు నాడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలతోనే సరిపుచ్చారు. అంతకుమించిన దారుణం ఏమిటంటే గతంలో దూరదృష్టితో ఎన్టీఆర్ చేపట్టిన ప్రాజెక్టులను సైతం పక్కనపెట్టేశారు. ఎన్టీఆర్ హయూంలో పిలిచిన టెండర్లను కూడా రద్దు చేయడం సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం. -
వైఎస్ లేఖ ఒక అనివార్యత!
ప్రస్తుతం టీడీపీ గోల చేస్తున్న ‘వైఎస్ లేఖ’కు కూడా చంద్రబాబు వైఫల్యాలే మూలం. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్ణాటక 1997 మార్చి 1న సుప్రీంకోర్టుకు (కేసు నం.ఓఎస్ 1/1997) వెళ్లింది. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ఈ ప్రాజెక్టులను చేపట్టడం, ఆ వెంటనే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు కావడం జరిగిపోయాయి. దాంతో మరోసారి కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించి ట్రిబ్యునల్ ముందు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పు ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోందని ఫిర్యాదు చేసింది. దాంతో వైఎస్ ప్రభుత్వం అనివార్యంగా ట్రిబ్యునల్‌కు లేఖ ఇవ్వాల్సి వచ్చింది. ‘మిగులు జలాలపై మాకు స్వేచ్ఛ ఉంది. ఒక హక్కుగా మేం కోరడం లేదు. అనుమతించండి’ అని వైఎస్ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. దాంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు యథావిధిగా కొనసాగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. చంద్రబాబు వైఫల్యాల పుణ్యమా అని కృష్ణా ట్రిబ్యునల్ రాష్ట్రానికి నష్టదాయకమైన తీర్పు వెలువరిస్తే.. వైఎస్ లేఖకు తనదైన శైలిలో వింత భాష్యాలు చెబుతూ ట్రిబ్యునల్ నష్టదాయక తీర్పుకు వైఎస్సే కారణవుని చంద్రబాబు నిందించే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరం! బాబు నిర్వాకం గాలేరు నగరికి తెలుసు.. 1985లో రాయలసీమ ఉద్యమ ఒత్తిడి కారణంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1989 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా శేషాచల రిజర్వాయర్‌కు రూ.30 లక్షలతో శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 1990 ఫిబ్రవరిలో మంత్రివర్గ సమావేశంలో గాలేరు నగరికి సంబంధించిన పనుల్ని చేపట్టాలని నిర్ణయించారు. 1993లో దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్‌ను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామిరెడ్డి అప్పటి సీఎం విజయభాస్కరరెడ్డికి సమర్పించారు. అనంతరం ప్రాజెక్టులో భాగమైన మిట్టకందాల డీప్ వెడ ల్పు పనులకు, గండికోట రిజర్వాయర్ తదితర పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకోసం రూ. 50 కోట్లను కూడా కేటాయించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నారుు. చివరకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 డిసెంబర్ 5న గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 1996లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. దాంతో గాలేరు నగరిలో భాగమైన గండికోట రిజర్వాయర్‌కు బాబు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అరుుతే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులూ లేకపోవడమే విచిత్రం. ఆ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్ని పట్టించుకోలేదు. చంద్రబాబు గద్దె దిగే 2004 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎంతో విలువైన సమయం వృథా అయింది. వైఎస్ అధికారంలోకి రాగానే 2004 జూన్ 10న ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు జీవో ఇచ్చారు. ఒక్క గాలేరు నగరే కాదు హంద్రీ-నీవా, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగొండ వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో బాబు నిర్లక్ష్యం ఇలాగే కొనసాగింది. ప్రాజెక్టుల కోసం వైఎస్ యాత్ర.. సాగునీటి ప్రాజెక్టులపై బాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ అనుక్షణం ప్రయత్నించారు. ఇందుకోసం ఏకంగా యాత్రనే చేపట్టారు. ఈ యాత్రలో చంద్రబాబు చేసిన శంకుస్థాపనలను గుర్తుచేస్తూ... వాటి వద్ద మొక్కలు నాటడంతో పాటు వాటికి ‘స్మృతి చిహ్నాలు’గా నామకరణం చేశారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. పాదయాత్ర సమయంలో కూడా ప్రాజెక్టుల ప్రాంతానికి వైఎస్ వెళ్లారు. ప్రాజెక్టుల ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి గుర్తుచేశారు. 2002 సెప్టెంబర్ 16న ఆయన యాత్రను ప్రారంభించారు. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి 1999 జూన్ 25న నాటి సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ వద్ద శంకుస్థాపన చేశారు. అదే ప్రాంతం నుంచి వైఎస్ యాత్రను ప్రారంభించారు. 1999లో శంకుస్థాపన చేసినప్పటికీ 2002 వరకూ ఒక్క రూపాయి కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు చేపట్టాలని అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, కనేకల్, బెలుగుప్ప, ఆత్మకూరు తదితర ప్రాంతాలను 2002 సెప్టెంబర్ 18వ తేదీన వైఎస్ సందర్శించారు. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు ఏకంగా రెండుసార్లు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో ఒకసారి... 1999లో ఆత్మకూరు వద్ద మరోసారి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని వైఎస్ డిమాండ్ చేశారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన పైలాన్స్ వద్ద మొక్కలు నాటారు. కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన వెలిగల్లు ప్రాజెక్టును పూర్తిచేయాలని వైఎస్ 2002 సెప్టెంబర్ 20న గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన వేసిన చంద్రబాబు... ఒక్క పైసా నిధులను విడుదల చేయలేదని మండిపడ్డారు. 1988లో ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఆయన మరణానంతరం చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ 2002 నాటికి 14 సంవత్సరాలైన సందర్భంగా... ఆక్కడి పైలాన్ చుట్టూ 14 మొక్కలను 2002 సెప్టెంబర్ 23న వైఎస్ నాటారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ సంగతి పక్కనపెడితే.... కనీసం గతంలో ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను సైతం నిర్లక్ష్యం చేయడాన్ని వైఎస్ దుయ్యబట్టారు. భవిష్యత్తులో రాబోయే నీటి ముప్పును ముందే గ్రహించిన వైఎస్... బాబు కళ్లు తెరిపించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ బాబు పట్టించుకోలేదు. రాష్ట్రానికి బాబు ద్రోహం ఇలా... ‘ఫస్ట్ ఇన్ టైం, ఫస్ట్ ఇన్ రైట్’ అనే స్ఫూర్తితో, బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసేలోపు ప్రాజెక్టులు నిర్మించాలని ఎన్టీఆర్ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. బాబు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోలేదు. అందిపుచ్చుకోలేదు! ప్రాజెక్టులను పట్టించుకోలేదు సరికదా ఎన్టీఆర్ పిలిచిన టెండర్లనూ రద్దు చేశారు! జలవినియోగంలో ముందుంటేనే హక్కులు సాధించుకోవచ్చునని కర్ణాటక యుద్ధప్రాతిపదికన ఆలమట్టి వంటి ప్రాజెక్టులు చేపడితే... ఆ వేగమెందుకో చంద్రబాబు అర్థం చేసుకోలేదు. అడ్డుకోలేదు. సరికదా కేంద్రంలోని అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో చక్రం తిప్పే స్థాయిలో తనూ పరోక్షంగా ఆ రాష్ట్రానికి సాయపడ్డారు! పాత ట్రిబ్యునల్ గడువుకు నాలుగేళ్ల ఏళ్ల ముందు కాలం, గడువు ముగిశాక కొత్త ట్రిబ్యునల్ ఏర్పడటానికి పట్టిన మరో 4 ఏళ్ల వ్యవధి.. అంటే 1996-2004లో కర్ణాటక, మహారాష్ట్రలు ప్రాజెక్టులపై ఇబ్బడిముబ్బడిగా నిధుల్ని వెచ్చించాయి. ప్రాజెక్టుల్ని నిర్మించుకోవాల్సిన విలువైన అవకాశాన్ని మన రాష్ట్రం కోల్పోయిందీ ఈ కాలంలోనే. బాబు పాలనాకాలమూ అదే. ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకత గురించి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత ఎలుగెత్తినా... చరిత్రహీనుడవుతావంటూ హెచ్చరించినా... పెండింగ్ ప్రాజెక్టుల వద్ద మొక్కలు నాటినా... చంద్రబాబు కళ్లు తెరుచుకోలేదు. తనకు ప్రాజెక్టుల నిర్మాణం చేతగాకపోగా... 2004 తరువాత వైఎస్ చేపట్టిన జలయజ్ఞానికి కూడా చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారు. బాబు మార్కు స్ఫూర్తి ఇదీ.. కర్ణాటక 300 టీఎంసీల సామర్థ్యంతో ఆలమట్టిని నిర్మిస్తుంటే దాన్ని నిలువరించలేని చంద్రబాబు అనంతపురం జిల్లా హద్దుల్లో 300 ఎంసీఎఫ్‌టీ స్థాయిలో నిర్మించే ఓ చిన్న చెరువులాంటి పరగోడు ప్రాజెక్టును రచ్చ చేయటానికి ప్రయత్నించారు. పరిటాల రవిని ఉసిగొల్పారు. దటీజ్ బాబు మార్కు రాజనీతిజ్ఞత! సుప్రీం ఉత్తర్వులిస్తేనే తీర్పు అమల్లోకి... బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా విచిత్రమే. ట్రిబ్యునల్ తీర్పు వెంటనే అమల్లోకి రాకుండా సుప్రీంలో రాష్ర్టం గతంలోనే ఎస్ఎల్పీ దాఖలు చేసింది. అంటే ఈ తీర్పు గెజిట్‌లో ప్రచురితమై ఆచరణలోకి రావాలంటే సుప్రీంకోర్డు ఉత్తర్వులను జారీ చేయాలి. ఈ విషయం తెలిసి కూడా కేవలం ప్రచారం కోసం చంద్రబాబు రాష్ర్టపతి ని కలిసి తీర్పు అమల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలనడం విడ్డూరం. బాబు చక్రం తిప్పినప్పుడే కర్ణాటకకు ఎక్కువ నిధులు! తెలుగుదేశం పదేళ్ళ పాలన (1995-2004)లో నీటిపారుదల మీద పెట్టిన ఖర్చు రూ.10,663 కోట్లు. అదే పదేళ్ళలో కర్ణాటక ప్రభుత్వం నీటి పారుదలకు పెట్టిన ఖర్చు రూ.19,391 కోట్లు. అంటే దాదాపు రెట్టింపు. ఏఐబీపీ అనేది చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్న 1996లో ఏర్పడింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే ఆయకట్టు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకం కింద అత్యధిక మొత్తంలో నిధులు చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్ళలోనే కర్ణాటకకు అందాయి. ఈ పథకం ప్రారంభమైన 1996 నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్న చివరి సంవత్సరం 2004 వరకు ఎనిమిదేళ్ళలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అందినది కేవలం రూ.867 కోట్లు. అదే కాలంలో కర్ణాటక ఏకంగా రూ.1954 కోట్లు దక్కించుకుంది. వైఎస్ హయూంలో సాగునీటికి 4 రెట్లు ఎక్కువగా నిధులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత, వైఎస్ ప్రభుత్వం 2004-09 మధ్య సాగునీటి మీద చేసిన వ్యయం ఏకంగా రూ.44,530 కోట్లు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం పదేళ్ళలో పెట్టిన ఖర్చుకంటే, వైఎస్ ప్రభుత్వం అయిదేళ్లలో చేసిన వ్యయం నాలుగు రెట్లు ఎక్కువ.ఇదే కాలంలో కర్ణాటక ఇరిగేషన్ మీద పెట్టిన ఖర్చు రూ.17,604 కోట్లు మాత్రమే. అంటే వైఎస్ ప్రభుత్వం కర్ణాటకతో పోలిస్తే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు చేసిందన్నమాట. కర్ణాటక 1994-99 మధ్య అయిదేళ్లలో నీటిపారుదల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని... వైఎస్ ప్రభుత్వం ఒక్క 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఒక్క ఏడాదిలోనే ఖర్చు చేసింది. కర్ణాటక 1999-2004 మధ్య అయిదేళ్లలో ఇరిగేషన్‌మీద ఎంత ఖర్చు చేసిందో 2006-07 సంవత్సరంలోనే వైఎస్ ప్రభుత్వం అంత డబ్బును ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపారుదల మీద వెచ్చించింది. -
అనుసంధానమే శరణ్యం
ట్రిబ్యునల్ తీర్పుతో మరో గత్యంతరం లేని పరిస్థితి పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్పాండే గతి ఈ విషయాన్ని గతంలోనే గుర్తించిన వైఎస్ కానీ వాటి నిర్మాణంపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం టెండర్ల స్థాయిలోనే పోలవరం, బుట్టదాఖలైన దుమ్ముగూడెం సాక్షి, హైదరాబాద్: కృష్ణా-గోదావరి అనుసంధానం అవసరం ఎంతగా ఉందో బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం గోదావరి నుంచి నీటిని తరలిస్తేనే కృష్ణా ఆయకట్టు రైతులు మనుగడ సాగించే పరిస్థితి నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని గతంలోనే గుర్తించారు. అందులో భాగంగానే పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులకు ఆయన ప్రాణం పోశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటి నిర్మాణం విషయంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణమే కీలకం: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కారణంగా మనకు రావాల్సిన నీటి కోటా గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాభావ కాలంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలపై ఆధారపడ్డ ఆయకట్టు తీవ్రంగా దెబ్బతిన డం ఖాయం. దీన్ని తట్టుకోవాలంటే పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌లను చేపట్టాలి. పోలవరం నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీల నీరు కృష్ణా బేసిన్‌లోకి వస్తుంది. వీటిలో 35 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు పోయినా, మిగతా 45 టీఎంసీలతో డెల్టా ఆయకట్టును కాపాడుకోవచ్చు. పైగా దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ద్వారా ఖమ్మం జిల్లా పరిధి నుంచి 165 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని సాగర్ దిగువకు తరలించడానికి అవకాశం ఉంది. ఈ నీటితో సాగర్ ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చు. ఆ మేరకు కృష్ణాలో మిగిలే నీటిని ఇటు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అవసరాలకే గాక కరువును ఎదుర్కొనే రాయలసీమ అవసరాలకు కూడా వాడుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించడంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. పోలవరం టెండర్లను ఖరారు చేసినా అనేక వివాదాల వల్ల పనులు మాత్రం జరగడం లేదు. ఇక దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టునైతే పూర్తిగా పక్కన పెట్టారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడమే లేదు. అనధికారికంగా ఆ ప్రాజెక్టును రద్దు చేశారనే చెప్పాలి!