పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 191 పోస్టులు
ప్రభుత్వ బ్యాంకుల్లో పలు కొలువుల నియామకాలకు ప్రకటనల జారీ పరంపర కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్.. మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత వివరాలు సమగ్రంగా..
మొత్తం పోస్టులు: 191
పోస్టుల వారీ ఖాళీలు: చీఫ్ మేనేజర్ (ఆర్కిటెక్ట్)-1; మేనేజర్ (ఐటీ)-75; మేనేజర్ (అగ్రికల్చర్)-30; మేనేజర్ (సెక్యూరిటీ)-35; మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ)-24; మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్)-2; మేనేజర్ (సివిల్ ఇంజనీర్)-3; మేనేజర్ (మెకానికల్ ఇంజనీర్)-1; మేనేజర్ (లా)-1; ఫైర్ ఆఫీసర్స్-6; ఆఫీసర్ (ఎకనామిక్స్)-2; ఆఫీసర్ (సివిల్ ఇంజనీర్)-4; ఆఫీసర్ (ఇండస్ట్రీ) మెకానికల్-2; ఆఫీసర్ (ఇండస్ట్రీ) ఎలక్ట్రికల్- 1; ఆఫీసర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్)-4.
రిజర్వేషన్‌ల వారీగా ఖాళీలు: ఎస్సీ-26, ఎస్టీ-20, ఓబీసీ-48, జనరల్ 97. మొత్తం మీద 7 పోస్టులను పీడబ్ల్యూడీలకు రిజర్వ్ చేశారు.
వేతనం: చీఫ్ మేనేజర్‌కు రూ.50,000-59,170; మేనేజర్‌కు రూ.31,705-45,950; మిగిలిన పోస్టులకు రూ.23,700-42,020.
విద్యార్హత: 2016, ఆగస్టు 23 నాటికి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: చీఫ్ మేనేజర్‌కు కనీస వయసు 35 ఏళ్లు, గరిష్టం 45 ఏళ్లు; మేనేజర్ (ఐటీ)కి కనీసం 25 ఏళ్లు, గరిష్టం 28 ఏళ్లు; మేనేజర్(అగ్రికల్చర్; సెక్యూరిటీ; ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇంజనీర్, లా)కు కనీసం 25 ఏళ్లు, గరిష్టం 35 ఏళ్లు; సెక్యూరిటీ మేనేజర్‌కు కనీసం 21 ఏళ్లు, గరిష్టం 35 ఏళ్లు; ఫైర్ ఆఫీసర్‌కు కనీసం 25 ఏళ్లు, గరిష్టం 40 ఏళ్లు; ఆఫీసర్ (ఎకనామిక్స్)కు కనీసం 21 ఏళ్లు, గరిష్టం 28 ఏళ్లు; ఆఫీసర్ (సివిల్; ఇండస్ట్రీ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్)కు కనీసం 21 ఏళ్లు, గరిష్టం 30 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష: 120 నిమిషాల(2 గంటల) వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇందులో నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ఒక తప్పు సమాధానానికి పావు (0.25) మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.50; జనరల్, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లు రూ.400 చెల్లించాలి.
రాత పరీక్ష కేంద్రం: రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే పరీక్ష కేంద్రం (హైదరాబాద్) కేటాయించారు.
ముఖ్య తేదీలు:
1. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 9
2. రాత పరీక్షను 2016, అక్టోబర్ 14న నిర్వహించే అవకాశం ఉంది.
3. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 2016, అక్టోబర్ 4 తర్వాత
వెబ్‌సైట్: www.pnbindia.in