ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు | Bachelor's degree course offered by IISc | Sakshi
Sakshi News home page

ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు

Published Thu, Apr 17 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు

ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు

 ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు
 స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలను తెలపండి?
 -శ్రీధర్, హైదరాబాద్
 వివిధ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్లను సక్రమంగా నిర్వహించడమే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్. ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు సంబంధించి షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పర్యవేక్షణ, పాల్గొనే క్రీడాకారులు, అధికారులు, సంబంధిత వర్గాలకు తగిన సౌకర్యాలు కల్పించడం వరకు అన్నీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ముఖ్య విధులు. అంతేకాకుండా టోర్నీలకు తగిన ప్రచారం కల్పించడం, మార్కెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేబాధ్యత కూడా వీరిదే. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో స్పోర్ట్స్ మేనేజర్‌గా అవకాశాలుంటాయి. ఆయా టోర్నమెంట్ల నిర్వహణ సమయంలో పీఆర్‌ఓగా కూడా వ్యవహరించవచ్చు. అంతేకాకుండా ప్రముఖ క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించే పర్సనల్ మేనేజర్, ఏజెంట్స్‌గా, పీఆర్‌ఓగా అవకాశాలుంటాయి. టైగర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి ప్రైవేట్ సంస్థలతోపాటు ప్రభుత్వ క్రీడా సంస్థల్లో కూడా వీరికి అవకాశాలుంటాయి. క్లబ్‌లు, హోటల్స్, రిసార్టులు, స్పోర్ట్స్ సెంటర్లు కూడా స్పోర్ట్స్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. విదేశాల్లోనూ అనేక అవకాశాలుంటాయి.
 
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
     పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్;
     అలగప్ప యూనివర్సిటీ- తమిళనాడు (డిస్టెన్స్‌లో)
     వెబ్‌సైట్:www.alagappauniversity.ac.in
 
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ - కోల్‌కతా
 
 
 
 వెబ్‌సైట్:  www.iiswbm.edu
 లక్ష్మీబాయ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్
 ఎడ్యుకేషన్-గ్వాలియర్.
     వెబ్‌సైట్: www.lnipe.gov.in
     ఎంబీఏ(స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్): తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ-చెన్నై
     వెబ్‌సైట్: www.tnpesu.org
 
 పీజీ డిప్లొమా ఇన్ జియోఇన్ఫర్మాటిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?    -రవి, కర్నూలు.
 జియో సైన్స్, ఇన్ఫర్మాటిక్స్ సబ్జెక్ట్‌ల కలయికతో రూపొందించిన కోర్సు జియోఇన్ఫర్మాటిక్స్. ఈ కోర్సు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) వంటి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైవేట్ రంగానికొస్తే.. సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, పబ్లిక్ హెల్త్, ట్రాన్స్‌పోర్టేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈ-కామర్స్ సంబంధిత సంస్థలు జియోఇన్ఫర్మాటిక్స్ నిపుణులను నియమించుకుంటాయి. ఈ విభాగంలో టాప్ రిక్రూటర్స్: గూగుల్, టీసీఎస్, రిలయన్స్, మాగ్నసాఫ్ట్ టెక్నాలజీ.
 పీజీ డిప్లొమా ఇన్ జియోఇన్ఫర్మాటిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్-
 డెహ్రాడూన్; వివరాలకు:  www.iirs.gov.in
     నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్
     వివరాలకు: http://npti.in
     జామియా మిలియా ఇస్లామియా-న్యూఢిల్లీ
     వివరాలకు: http://jmi.ac.in
     టెరీ యూనివర్సిటీ-ఢిల్లీ
     వివరాలకు: www.teriuniversity.ac.in
     సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్
     వివరాలకు:www.cuj.ac.in
     సీడాక్-పుణే; వివరాలకు: http://cdac.in
 
 ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు వివరాలను తెలపండి?
 -శ్రీధర్, నిర్మల్.
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ).. శాస్త్ర పరిశోధనలకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత వేదిక. జాబ్ ఇండస్ట్రీ కోరుకుంటున్న స్కిల్స్, పరిశోధనల పరంగా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచే ఉద్దేశంతో బ్యాచిలర్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్)డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. ఇందులో ఎనిమిది సెమిస్టర్‌లు ఉంటాయి. మొదటి మూడు (1,2,3) సెమిస్టర్‌లలో సైన్స్‌కు సంబంధించి క్లాసికల్, సైంటిఫిక్ అంశాలతోపాటు మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన బేసిక్ ప్రిన్సిపుల్స్‌పై అవగాహన కల్పిస్తారు. వీటిని కోర్ సబ్జెక్ట్‌లుగా పరిగణిస్తారు. తర్వాతి 4,5,6 సెమిస్టర్‌లలో.. మొదటి మూడు సెమిస్టర్ల తర్వాత విద్యార్థి తనకు ఆసక్తిని బట్టి ఏదో ఒక స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం ఆరు రకాల స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉంటాయి. అవి.. బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఇవన్నీ ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్‌లు. అయితే విద్యార్థి తన స్పెషలైజేషన్ కాకుండా ఆసక్తి, నాలెడ్జ్ ఆధారంగా ఇతర స్పెషలైజేషన్‌లలోని 30 శాతం సిలబస్‌ను కామన్‌గా చదవాలి. ఏడు, ఎనిమిదో సెమిస్టర్‌లను పూర్తిగా ప్రాజెక్ట్ వర్క్ కోసం కేటాయించారు.  అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా 12వ తరగతి లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
 ప్రవేశం: ఐఐటీ-జేఈఈ, ఏఐపీఎంటీ వంటి జాతీయ ఎంట్రన్స్‌లలో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తుంది. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)కు ఎంపికైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
 వివరాలకు: www.iisc.ernet.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement