కామన్వెల్త్ స్కాలర్‌షిప్ 2014-15
యూకేలో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘కామన్వెల్త్ స్కాలర్‌షిప్ 2014-15’ కోసం ఆ దేశంలోని కామన్వెల్త్ స్కాలర్‌షిప్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూకేలోని 69 యూనివర్సిటీలు ఈ స్కాలర్‌షిప్ సౌక్యరాన్ని కల్పిస్తున్నాయి.
ఆఫర్ చేసే సబ్జెక్టులు:
ఎకనామిక్స్, సోషల్, టెక్నలజికల్ డెవలప్‌మెంట్ సంబంధిత సబ్జెక్టులు (ఎంబీఏ మినహా). బిజినెస్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పీహెచ్‌డీ విద్యార్థులకు నిబంధనల మేరకు జీమ్యాట్/జీఆర్‌ఈ స్కోర్‌ను కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
అకడమిక్ ప్రతిభ (వివిధ స్థాయిల్లో సాధించిన మార్కులు, గెలుచుకున్న బహుమతులు, పబ్లికేషన్స్ తదితరాలు), స్టడీ ప్లాన్ (చేరే కోర్సు, పరిశోధన అంశాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి) వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్కాలర్‌షిప్ వ్యవధి:
మాస్టర్స్ కోర్సులకు ఏడాది. పీహెచ్‌డీ కోర్సులకు మూడేళ్లు. స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, తిరుగు ప్రయాణ చార్జీలు, వ్యక్తిగత ఖర్చులు, థీసిస్ ప్రిపరేషన్ కోసం అయ్యే ఖర్చులు, యూకేలో స్టడీ టూర్ ఖర్చు లు, వీసా ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితరాలు చెల్లిస్తారు.
అర్హతలు:
విద్యార్థి కామన్వెల్త్ కూటమిలోని అభివృద్ధి చెందుతున్న దేశానికి చెందిన పౌరుడై ఉండాలి.
ఫస్ట్ క్లాస్/సెకండ్ క్లాస్ డిగ్రీ లేదా పీజీ.
స్పాన్సర్ చేసే ఇన్‌స్టిట్యూట్ సదరు విద్యార్థి ఇంగ్లిష్ రాయడం, మాట్లాడటంలో నిష్ణాతుడని నిర్ధారించాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వస్తామని హామీ ఇవ్వాలి.
దరఖాస్తు విధానం: విద్యార్థులు ఎలక్ట్రానిక్ అప్లికేషన్ సిస్టమ్ (ఈఏఎస్) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 3, 2014.
వివరాలకు: cscuk.dfid.gov.uk/apply/
scholarshipsdevelopingcw/