యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాల నిర్వహణకు నిర్వహించే స్కూసెట్-2015 నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్కూసెట్-2015 మార్గదర్శకాలను డెరైక్టర్ ఆఫ్ ఆడ్మిషన్స్ సిద్ధం చేయడానికి 10 మంది ప్రొఫెసర్లతో కూడిన ప్రొఫెసర్ల కమిటీని నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్య తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
వీరితో పాటు డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య ఎం.డి.బావయ్య, డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఎం.ప్రభాకర్, రిజిస్ట్రార్‌లు ఎక్స్‌ఆఫీసియో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య కె.లాల్‌కిశోర్ అధ్యక్షతన ఏర్పడింది. వచ్చే సోమవారం జరిగే అధికారిక సమావేశంలో కమిటీ పూర్తిస్థాయి సమావేశం తేదీలు వెల్లడించనున్నారు. స్కూసెట్-2015 మార్గదర్శకాల విధివిధానాలు, ఫీజుల వివరాలు, కోర్సు వివరాలు, పరీక్ష తేదీలు వంటి అంశాలను అడ్వైజయిరీ కమిటీ సమావేశం నిర్ణయించనుంది. ఈ నిర్ణయాలను అకడమిక్ స్టాండింగ్ కమిటీ తుది రూపు ఇవ్వనుంది. వీటిని డెరైక్టరేట్ ఆఫ్ ఆడ్మిషన్స్ పాటిస్తారు.
రీసెట్ -2015కు మరో కమిటీ
ఎం.పిల్, పీహెచ్‌డీ ప్రవేశాల నిర్వహణకు నిర్వహించే ఎస్కేయూ రీసెట్-2015 పరీక్ష మార్గదర్శకాలకు 11 మంది ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియామించారు. ప్రొఫెసర్ల పదవీ వచ్చే రెండేళ్లకు ముగిసే నేపథ్యంలో గతంలో వారికి గైడ్‌షిప్ అవకాశం ఇచ్చేవారు కాదు. కారణం పీహెచ్‌డీ గడువు కనీసం మూడేళ్లు కాల వ్యవధి ఉండడంతో ఈ మేరకు నిబంధనలు అనుసరించారు.
అయితే ఈ దఫా రెండేళ్ల కాల వ్యవధిలో రిటైర్ అయ్యే వారికి గైడ్‌షిప్ ఇవ్వాలనే ప్రతిపాదనకు రీసెట్ అడ్వైజయిరీ కమిటీ నిర్ణయం ఆధారపడి ఉంది. పరిశోధన కుంటుపడడం, ఫెలోషిప్‌లు మందగించడంతో అవకాశం కల్పిస్తే మంచిదనే సదాభిప్రాయంతో ప్రతిపాదనలు అడ్వైజయిరీ కమిటీకి పంపారు.
ప్రవేశాల నోటిఫికేషన్లకు కసరత్తు
Published Thu, Mar 5 2015 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement