ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: విశ్వవిద్యాలయ బోధనా వ్యవస్థను కుంటుపరుస్తున్న బోధకుల కొరత త్వరలో తీరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా నియామక ప్రక్రియ చురుకుగా సాగుతోంది. 34 మంది బోధకుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా, ప్రస్తుతం వాటి పరిశీలన జరుగుతోంది. 2008లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పడ్డాక అప్పటివరకు ఇక్కడి ఏయూ పీజీ కేంద్రంలో పని చేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన 22 మంది అధ్యాపకులు మాతృ సంస్థ అయిన ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లిపోయారు. గత ఐదేళ్లుగా ఆ పోస్టులు భర్తీ కాలేదు. దీంతో కాంట్రాక్టు బోధకులతోనే కాలక్షేపం చేస్తున్నారు. అప్పట్లో కొత్తగా ప్రారంభించిన బయోటెక్నాలజీ విభాగంలో నలుగురు, సోషల్ వర్కులో ముగ్గురు రెగ్యులర్ బోధకులను మాత్రమే నియమిం చారు.
2011లో 34 బోధకుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే ప్రభుత్వం నుంచిఅనుమతి లభించకపోవడం, రోస్టర్ అమలులో తప్పులు దొర్లడం వంటి కారణాలతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఆ నోటిఫికేషన్ కాలపరిమితి కూడా దాటిపోయిం ది. వాస్తవంగా వర్సిటీలో ఉన్న 16 కోర్సులకు 88 మంది రెగ్యులర్ బోధన సిబ్బంది అవస రం. ఈ విషయాన్ని వీసీ ప్రొఫెసర్ లజపతిరాయ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అనుమతి సాధించారు. 2011 నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ ఏడాది జూన్ 22న మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గతంలో వచ్చిన వాటితో కలిపి కలిపి 512 దరఖాస్తులు అందాయి. వాటి పరిశీలనకు అధికారులు శ్రీకారం చుట్టారు. ముందుగా ఏ పోస్టుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల అర్హతలు పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
అనంతరం ఇంట ర్వ్యూల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదంతా రహస్య ప్రక్రియ కావటంతో వివరాలు వెల్లడించేందుకు అధికారులు సుముఖంగా లేరు. నోటిఫికేషన్ వివరాల ప్రకా రం ఎల్.ఎల్.బిలో ఏడు, రూరల్ డెవలప్‌మెంట్‌లో నాలుగు, ఎకనామిక్స్‌లో ఐదు, ఎం.ఎల్.ఐ.ఎస్.సిలో మూడు, ఎంకాంలో మూడు, గణితంలో ఐదు, బయోటెక్నాలజీలో మూడు, సోషల్ వర్కులో నాలుగు పోస్టులు ఉన్నాయి. ఎనిమిది ప్రొఫెసర్, ఏడు అసోసియేట్ ప్రొఫెసర్, 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తారు. నియామక ప్రక్రియ గురించి వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను వివరాలు కోరగా రహస్య ప్రక్రియ అయినందున వివరాలు వెల్లడించలేమన్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి అయ్యాక ఇంటర్వ్యూల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. ఇంటర్వ్యూలకు ముం దు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందన్నారు.
బోధన బాధలు తీరనున్నాయ్!
Published Mon, Aug 12 2013 3:07 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement