హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో అధ్యాపక పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. 42 అధ్యాపక ఖాళీల్లో ప్రొఫెసర్-11, అసోసియేట్ ప్రొఫెసర్-20, అసిస్టెంట్ ప్రొఫెసర్-11 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు అందజేసేందుకు జనవరి 2, 2015 వరకు చివరి తేదీగా నిర్ణయించారు. ఇతర వివరాలకు http://uohyd.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
పలు విభాగాల్లో ఖాళీలు ఇవీ..
యూనివర్సిటీలోని సైన్స్, సోషల్ సైన్స్, హ్యు మానిటీస్ విభాగాల్లోని అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు వర్సిటీ అధికారులు సిద్ధమయ్యారు. ఖాళీల వివరాలు... గణితం-3, ఫిజిక్స్-1, రసాయన శాస్త్రం -4, యానిమల్ బయాలజీ-1, ప్లాంట్‌సైన్స్-3, ఎర్త్ అండ్ స్పేస్ సెన్సైస్-2, ఇం జనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-7, మెడికల్ సైన్స్-3, న్యూరల్ కాగ్నెటివ్ సైన్స్-1, ఇంగ్లిష్-1, హిందీ-2, ఫిలాసఫీ-1, సంస్కృతం-2, అప్లాయిడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్-1, క్లాసికల్ తెలుగు లాంగ్వేజ్-1, చరిత్ర-1, అర్థశాస్త్రం-4, ఉమెన్స్ స్టడీస్-1, డ్యాన్స్-1, థియేటర్ ఆర్ట్స్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
హెచ్‌సీయూలో అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్
Published Thu, Dec 4 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement
Advertisement