ఉద్యోగ సమాచారం | Employment Information | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సమాచారం

Published Mon, Oct 19 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

Employment Information

ఆయుర్వేద పరిశోధన సంస్థలో సీనియర్ కన్సల్టెంట్, ఎస్‌ఆర్‌ఎఫ్
 విజయవాడలోని నేషనల్ ఆయుర్వేద రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వెక్టర్ బోర్‌‌న డిసీజెస్.. వివిధ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలు.. సీనియర్ కన్సల్టెంట్ (పాథాలజిస్ట్) (ఖాళీలు-1), ఎస్‌ఆర్‌ఎఫ్ (ఆయుర్వేద) (ఖాళీలు-3), డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఖాళీలు-2), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఖాళీలు-2). ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 27. వివరాలకు http://www.ccras.nic.in చూడొచ్చు.
         
వైఎస్సార్ కడప జిల్లా కోర్టులో  స్టెనోగ్రాఫర్లు
 వైఎస్సార్ కడప జిల్లా కోర్టు.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు-7. వయసు 34 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 7. వివరాలకు http://ecourts.gov.in చూడొచ్చు.
 
హెచ్‌సీయూలో టెక్నికల్ అసిస్టెంట్లు
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ .. తాత్కాలిక ప్రాతిపదికపై టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) (కెమిస్ట్రీ, ఫిజిక్స్) (ఖాళీలు-2), టెక్నికల్ అసిస్టెంట్ (ఆర్ అండ్ డీ) (కెమిస్ట్రీ) (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి అక్టోబర్ 28న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 25. వివరాలకు www.uohyd.ac.in చూడొచ్చు.
 
 స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో అసిస్టెంట్లు
 అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్.. సైంటిఫిక్ అసిస్టెంట్ (ఖాళీలు-2), లైబ్రరీ అసిస్టెంట్-ఎ (ఖాళీలు-2), టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) (ఖాళీలు-4), టెక్నికల్ అసిస్టెంట్ (మెకట్రోనిక్స్) (ఖాళీలు-1), టెక్నీషియన్-బి (ఎలక్ట్రీషియన్) (ఖాళీలు-16), టెక్నీషియన్-బి (మెషినిస్ట్) (ఖాళీలు-1), టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్స్/ఐటీ) (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 2. వివరాలకు www.sac.gov.in చూడొచ్చు.
 
ఎన్‌సీటీఈలో కన్సల్టెంట్, రీసెర్‌‌చ అసిస్టెంట్స్
 నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ).. కాంట్రాక్టు పద్ధతిలో కన్సల్టెంట్ (ఖాళీలు-3), సీనియర్/చీఫ్ కన్సల్టెంట్ (ఖాళీలు-1), జూనియర్ కన్సల్టెంట్ (అకడమిక్) (ఖాళీలు-1), కన్సల్టెంట్ (ఫైనాన్‌‌స అండ్ అకౌంట్స్) (ఖాళీలు-1), కన్సల్టెంట్ (ఇ-గవర్నెన్‌‌స) (ఖాళీలు-1), కన్సల్టెంట్ (పబ్లిక్ రిలేషన్‌‌స అండ్ ప్రమోషన్‌‌స) (ఖాళీలు-1), రీసెర్‌‌చ అసిస్టెంట్స్ (ఖాళీలు-4) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 20. వివరాలకు http://ncte-india.org చూడొచ్చు.
 
ఓషియన్ రీసెర్‌‌చలో ప్రాజెక్ట్ సైంటిస్ట్,టెక్నికల్ అసిస్టెంట్

 నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషియన్ రీసెర్‌‌చ.. తాత్కాలిక ప్రాతిపదికపై ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి (ఖాళీలు-3), టెక్నికల్ ఆఫీసర్ (ఖాళీలు-1), సెక్షన్ ఆఫీసర్ (ఖాళీలు-2), టెక్నికల్ అసిస్టెంట్ (ఖాళీలు-4), అసిస్టెంట్ (ఖాళీలు-4), పర్సనల్ అసిస్టెంట్/స్టెనో గ్రేడ్-1 (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.ncaor.gov.in చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement