సమాజ సేవకు.. మైక్రో బయాలజిస్ట్ | Micro Biology course to choose best career and Make social service | Sakshi
Sakshi News home page

సమాజ సేవకు.. మైక్రో బయాలజిస్ట్

Published Sat, Jul 19 2014 6:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

సమాజ సేవకు.. మైక్రో బయాలజిస్ట్

సమాజ సేవకు.. మైక్రో బయాలజిస్ట్

అప్‌కమింగ్ కెరీర్: సూక్ష్మ జీవశాస్త్రం(మైక్రో బయాలజీ)... మహా సముద్రం లాంటి జీవశాస్త్రంలో ఒక భాగం. మనిషి కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవుల అధ్యయనమే.. సూక్ష్మ జీవశాస్త్రం. భూగోళంపై లెక్కలేనన్ని సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. వాటిలో మనిషికి శత్రువులు, మిత్రులు.. ఉపయోగపడేవి, అప కారం చేసేవి.. రెండూ ఉన్నాయి. శత్రు జీవు లను నిర్మూలించాలి. మిత్ర జీవులను కాపా డుకోవాలి. వాటిని అనుకూలంగా మార్చు కొని, జీవితాన్ని మరింత సుఖవంతంగా మార్చుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించు కోవాలి. ఇవన్నీ చేసేవారే.. మైక్రో బయాల జిస్ట్‌లు. మంచి వేతనంతోపాటు పరిశోధనల ద్వారా సమాజానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించే కెరీర్.. మైక్రో బయాలజిస్ట్.
 
 ఐటీ ఇంజనీర్లకంటే అధిక వేతనాలు
 మైక్రో బయాలజీలో అగ్రికల్చరల్, సాయిల్, మెడికల్, ఎన్విరాన్‌మెంటల్, ఇండస్ట్రియల్, ఫుడ్ మైక్రోబయాలజీ తదితర ఉప విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో మైక్రో బయాలజిస్ట్‌లకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. పర్యావరణం, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, పేపర్, టెక్స్‌టైల్, లెదర్, ఆహారం.. తదితర పరిశ్రమల్లో వీరికి డిమాండ్ పెరుగు తోంది. పరిశోధనల్లో మంచి అనుభవం సంపా దించి, నైపుణ్యాలు పెంచుకున్న మైక్రో బయాల జిస్ట్‌లకు ఐటీ ఇంజనీర్ల కంటే అధిక వేతనాలు అందుతున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
 
 అవకాశాలు పుష్కలం
 మైక్రో బయాలజీ కోర్సును పూర్తిచేస్తే.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, హెల్త్‌కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు. ఫుడ్ క్వాలిటీ ఆఫీసర్, పొల్యూషన్ కంట్రోలర్, ప్రొడక్ట్ ఇంజనీర్, ఫుడ్ టెక్నాలజిస్ట్, ఇండస్ట్రియల్ మైక్రో బయాలజిస్ట్, పాథాలజీ ల్యాబ్‌ల్లో సైంటిస్ట్, పేటెంట్ అటార్నీ, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర కొలువులు అందుబాటులో ఉన్నాయి.  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్), డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ స్థిరపడొచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు మైక్రో బయాలజీలో పరిశోధనలు చేపట్టేందుకు యువ సైంటిస్ట్‌ల కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రాజెక్ట్‌లను ప్రవేశపెడుతున్నాయి. ప్రత్యేకంగా నిధులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి.
 
 అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత మైక్రో బయాలజీలో గ్రాడ్యుయేషన్ చదవొచ్చు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే ఉద్యోగార్హతలు పెరుగుతాయి.
 
 వేతనాలు
 మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. నైపుణ్యాలు పెంచుకుంటే కార్పొరేట్ సంస్థల్లో ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు భారీ వేతన ప్యాకేజీ పొందొచ్చు.
 
 మైక్రో బయాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
  ఉస్మానియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
 వెబ్‌సైట్: www.uohyd.ac.in  
 నాగార్జునా విశ్వవిద్యాలయం
 వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
 యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
 వెబ్‌సైట్: www.du.ac.in  
 మైక్రోబయోటెక్నాలజీతో ఆల్‌రౌండ్ ప్రతిభ
 
 ‘‘గత 15-20 ఏళ్లుగా రీసెర్స్, టెక్నాలజీ పరంగా ప్రాచుర్యంలోకి వచ్చింది మైక్రో బయోటెక్నాలజీ. కోర్సులో ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టులు ఉండటంతో విద్యార్థులు ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. దక్షిణాదిన మొదటిసారి ఈ కోర్సును ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ప్రవేశపెట్టారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు విస్తరించింది. విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో బోధన, పరిశోధనలకు అవకాశాలున్నాయి. ప్రతిభ గలవారికి ప్రభుత్వ సంస్థల్లో పరిశోధనలతోపాటు ఫెలోషిప్‌లు అందుతున్నాయి. ఆరేళ్ల వ్యవధిలో రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకూ ఫెలోషిప్ లభిస్తుంది. పీహెచ్‌డీ పూర్తిచేసి సమర్థత నిరూపించుకోగలిగితే ప్రారంభ వేతనమే రూ.40 వేల వరకూ లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పలు దేశాల పరిశోధన సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి’’.
 - డాక్టర్ ఎం.గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ మైక్రోబయాలజీ విభాగం, ఓయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement