చక్కటి చిక్కటి కెరీర్‌కు... టీ టేస్టర్! | Tea taster career will have good life and huge hikes | Sakshi
Sakshi News home page

చక్కటి చిక్కటి కెరీర్‌కు... టీ టేస్టర్!

Published Wed, Sep 3 2014 12:07 AM | Last Updated on Sat, Aug 11 2018 4:36 PM

చక్కటి చిక్కటి కెరీర్‌కు... టీ టేస్టర్! - Sakshi

చక్కటి చిక్కటి కెరీర్‌కు... టీ టేస్టర్!

అప్‌కమింగ్ కెరీర్: ద్రవ పదార్థాల రంగు, రుచి, వాసన, చిక్కదనాన్ని కచ్చితంగా గుర్తించగల సామర్థ్యం మీ సొంతమా? అయితే, మీలాంటి వారికి సరిగ్గా సరిపోయే అద్భుతమైన నయా కెరీర్.. టీ టేస్టింగ్. తేనీరు లేనిదే తెల్లవారని వారెందరో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తేనీటి ప్రియులకు కొదవే లేదు. ప్రజల అభిరుచులను గుర్తించి, వారికి నచ్చే టీ రుచులను అందించే టీ టేస్టర్‌కు ప్రస్తుతం దేశవిదేశా ల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారికి భారీ వేతనాలు, మంచి జీవితం సొంతమవుతున్నాయి. ఇటీవలి కాలంలో హాస్పిటాలిటీ రంగంలో గుర్తింపు పొందుతున్న ట్రెండ్.. టీ టెస్టింగ్.  
 
పార్‌‌టటైమ్, ఫుల్‌టైమ్‌గా అవకాశాలు
 టీ అనేది అన్ని దేశాల సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. పొద్దున తేనీరు సేవిస్తే రోజంతా ఉల్లాసంగా గడిచిపోతుంది. ప్రాచీన కాలం నుంచే వాడుకలో ఉన్న టీకి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. తోటలో టీ ఆకు ఉత్పత్తి నుంచి అది పొడిగా మారి వినియోగదారుడికి చేరే వరకు మధ్యలో ఎన్నో దశలు ఉంటాయి. ఇందులో కీలకపాత్ర టీ టేస్టర్‌దే. ఆకు నాణ్యతను, అది టీగా మారిన తర్వాత రంగును, రుచిని పరీక్షించి సంతృప్తిచెందిన తర్వాతే మార్కెట్‌లోకి విడుదల చేయాలి. ప్రాంతాలను బట్టి జనం అలవాట్లు, అభిరుచులు మారుతుంటాయి. వాటిని బట్టి టీని ఉత్పత్తి చేయాలి. ప్రపంచంలో టీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో శ్రీలంక, చైనాలతోపాటు భారత్ కూడా ఉంది. మనదేశంలో అస్సాం, కేరళ రాష్ట్రాల్లో టీ తోటలు అధికంగా ఉన్నాయి. టీ టేస్టర్లకు టీ ఎస్టేట్లలో, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ టేస్టర్లుగా పనిచేసుకోవచ్చు. వీరు టీ బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి, దిగుమతి వంటి కార్యకలాపాలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. గార్డెనర్లతో, పరిశోధకులతో కలిసి పని చేయాలి.
 
 కావాల్సిన లక్షణాలు:
 టీ టేస్టర్లకు టీ చరిత్ర, టీ ప్లాంటేషన్, టీలో రకాలు, గ్రేడ్లు వంటి వాటిపై పరిజ్ఞానం ఉండాలి. టీ ప్రాసెసింగ్, ప్రిపరేషన్‌పై తగిన అనుభవం అవసరం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకొనే లక్షణం ఉండాలి. టీ రంగు, రుచిని కచ్చితంగా గుర్తించే నైపుణ్యాలు ఉండాలి. వివిధ రకాల టీల మధ్య తేడాలను విడమరిచి చెప్పగల సామర్థ్యం పెంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా టీ మార్కెట్‌లో వస్తున్న మార్పులను పసిగడుతూ తదనుగుణంగా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
 
 అర్హతలు:
 టీ టేస్టింగ్‌పై మనదేశంలో డిగ్రీ కోర్సులు లేకపోయినా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైనవారు వీటిలో చేరొచ్చు. టీ టేస్టింగ్‌ను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకోవాలని భావిస్తున్నవారు ఫుడ్ సెన్సైస్, హార్టికల్చర్, అగ్రికల్చరల్ సైన్స్ వంటి సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం మంచిది. వృక్షశాస్త్రం చదివినవారు ఈ రంగంలో రాణించేందుకు అవకాశం ఉంటుంది.
 
 వేతనాలు:
 టీ టేస్టర్లకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. ఫైవ్‌స్టార్ హోటళ్లలో ప్రారంభంలో నెలకు రూ.30 వేల వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి నెలకు రూ.50 వేలకు పైగానే పొందొచ్చు. టీ ఎస్టేట్లలో ఇంకా ఎక్కువ వేతనాలు ఉంటాయి.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
     డార్జిలింగ్ టీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్
     వెబ్‌సైట్: www.nitm.in
     ఉపాసీ టీ రీసెర్చ్ ఫౌండేషన్
     వెబ్‌సైట్: www.upasitearesearch.org
     బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ స్టడీస్
     వెబ్‌సైట్: www.bifsmgmt.org
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్
     వెబ్‌సైట్: www.iipmb.edu.in
     లిప్టన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీ
     వెబ్‌సైట్: www.lipton.com.au
     స్పెషాలిటీ టీ ఇన్‌స్టిట్యూట్-యూఎస్‌ఏ
     వెబ్‌సైట్: www.teausa.com
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 పోటీ పరీక్షల్లో ‘ఆమ్లాలు - క్షారాలు’ పాఠ్యాంశం ప్రాధాన్యం ఏమిటి?         - జి.శ్రీనివాస్, కుత్బుల్లాపూర్
 
  పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్ జనరల్ స్టడీస్-2013 ప్రశ్నపత్రంలో రసాయన శాస్త్రం నుంచి 12 ప్రశ్నలు అడిగారు. వీటిలో ఎక్కువ శాతం మానవ జీవితంతో ముడిపడి ఉన్న వివిధ అంశాలకు సంబంధించినవే. వీటిలో ప్రధానమైన అంశం ఆమ్లాలు- క్షారాలు. నిత్యజీవితంలో ఆమ్లాలు-క్షారాల ప్రస్తావన లేని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రాధాన్యం దృష్ట్యా దీన్ని క్షుణ్నంగా చదివి వివిధ అంశాలపై పట్టు సాధించాలి. ఉదాహరణకు మానవ ఉదరంలో ఉండేది బలమైన హైడ్రోక్లోరికామ్లం. ఎర్రచీమలు కుడితే  శరీరంలోకి ప్రవేశించేది ఫార్మికామ్లం. సోడానీటిలో ఉండేది కార్బోనికామ్లం.
 
 బ్యాటరీలో సల్య్ఫూరికామ్లం ఉంటుంది. రుచి కోసం ఉపయోగించే టేబుల్ సాల్ట్ ఆమ్ల-క్షార తటస్థీకరణ చర్య ద్వారా వచ్చే లవణం. అలాగే పులుపు పదార్థాల్లో ఉండే ఆమ్లాల గురించి కూడా  తెలుసుకోవాలి. చిన్న పిల్లలు ఏడిస్తే తాగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియాతో మొదలుకొని వివిధ యాంటాసిడ్‌లలో క్షారాలను ఉపయోగిస్తారు. నేలల ఆమ్లత్వం ఎక్కువై క్షారాలు తగ్గిపోయినప్పుడు చౌడు భూములుగా మారతాయి. కాబట్టి క్షారమయమైన సున్నం వంటి పదార్థాలను నేలలో చల్లుతారు.  పోటీ పరీక్షల కోణంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 7 నుంచి 10వ తరగతుల పాఠ్యపుస్తకాలను చదవాలి.
 ఇన్‌పుట్స్: డా.బి.రమేశ్, సీనియర్ ఫ్యాకల్టీ  
 
 బీపీసీఎల్‌లో జనరల్ వర్క్‌మెన్‌లు
 కొచ్చిన్‌లోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) జనరల్ వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
     జనరల్ వర్క్‌మెన్ - బి
 విభాగాలు: కెమికల్:30, మెకానికల్:30
 అర్హతలు: 60 మార్కులతో శాతం కెమికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
 వయసు: ఆగస్టు 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు
     జనరల్ వర్క్‌మెన్-బి(ట్రైనీ)
 విభాగాలు: టర్నర్: 3, వెల్డర్:3, ఫిట్టర్:2
 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో 60 శాతం మార్కులతో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. హెచ్‌వీడీ డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి.
 వయసు: ఆగస్టు 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 15
 వెబ్‌సైట్: www.bpclcareers.in
 
 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్  సీనియర్ మైనింగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
     డిప్యూటీ జనరల్ మేనేజర్(మైనింగ్) : 6
 విభాగం: రా మెటీరియల్స్
     డిప్యూటీ జనరల్ మేనేజర్(మైనింగ్) : 3
 విభాగం: కాలరీస్
 అర్హతలు:  65 శాతం మార్కులతో మైనింగ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. మొదటి శ్రేణి మైన్స్ మేనేజర్ సర్టిఫికెట్ ఉండాలి. 20 ఏళ్ల అనుభవం అవసరం.
 వయసు: 48 ఏళ్లకు మించకూడదు.
 చివరి తేది: సెప్టెంబర్ 30
 వెబ్‌సైట్: www.sail.co.in
 
 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
 హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యా విధానంలో కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     ఎంఏ, విభాగాలు: జ్యోతిషం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, టూరిజం అండ్ మేనేజ్‌మెంట్.
     ఎంసీజే, అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
     బీఏ, విభాగాలు: కర్ణాటక సంగీతం, స్పెషల్ తెలుగు.
 అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత.
     పీజీ డిప్లొమా, విభాగాలు: జ్యోతిషం, టీవీ జర్నలిజం.
 అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత.
     డిప్లొమా ప్రోగ్రామ్, విభాగాలు: జ్యోతిషం, మోడ్రన్ తెలుగు.
     సంగీత విశారద. అర్హత: పన్నెండేళ్లు నిండి ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31
 వెబ్‌సైట్: http://teluguuniversity.ac.in
 
 పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
 ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
 అర్హతలు: 50 శాతం మార్కులతో బీఎస్సీ/బీ ఫార్మసీ/ బీఎస్సీ(అగ్రి)/బీవీఎస్సీ/బీడీఎస్/బీహెచ్‌ఎంఎస్/బీఏఎంస్/ బీయూఎంఎస్/బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంసీఏ/
 పీహెచ్‌డీ ఉత్తీర్ణత. చివరి తేది: సెప్టెంబర్ 30
 వెబ్‌సైట్: www.osmania.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement