ఎక్స్‌ట్రీమ్ ఎగ్‌నాగ్
కాఫీని సేవించ కాఠిన్యమే కరుగు
తేనీరు తాగంగ తేజమొచ్చు
మధువు గ్రోలునపుడు మాధుర్యమే హెచ్చు
విశ్వజనులకెల్ల వైనుతేయు!
‘మధు’రోక్తి
‘అంతా నా తాగుడు గురించే మాట్లాడతారు.. నా దాహాన్ని గురించి ఆలోచించరేం..?’
- స్కాటిష్ సామెత
‘సిటీ’జనులలో కొందరు కాఫీగత ప్రాణులు, ఇంకొందరు టీ తప్ప మరో పానీయూన్ని ముట్టని ‘టీ’టోటలర్లు. అబ్కారీ లెక్కల సాక్షిగా మెజారిటీ మాత్రం ‘మద్య’తరగతి జీవులే! ‘మద్య’తరగతి మహాజనులలో అత్యధికులు లౌకికవాదులు. పానీయూల పట్ల వారు చాలా నిష్పాక్షికులు. ప్రాతఃసంధ్యలో కాఫీని, మధ్యాహ్న సంధ్యలో తేనీటిని, సాయుంసంధ్యలో వుధువును తీర్థంగా పుచ్చుకుంటారు. తవు అభిమాన స్వవుత పానీయూన్ని గౌరవిస్తూనే, పరపానీయూలనూ సవూదరిస్తారు. ప్రాచీనతనే ప్రావూణికంగా తీసుకుంటే, కాఫీ కంటే తేనీరు, తేనీటి కంటే వుధువు ప్రాచీనమైనవి. వుంచినీళ్ల తర్వాత వూనవుడు ఆస్వాదించిన అత్యంత ప్రాచీన పానీయుం మధువు వూత్రమే. కాఫీని, తేనీటిని ‘తీర్థం’కరులు ‘ఉప’ద్రవాలుగా పరిగ్రహించడం కద్దు. తీర్థాన్ని పోషక పానీయుంగా మార్చేందుకు గుడ్డు సొననూ కలిపికొట్టే ‘గుడ్డు’బాయ్స్ లేకపోలేదు. ప్రపంచ గుడ్డు రోజు సందర్భంగా ఈ వారం మీకోసం..
ఎక్స్‌ట్రీమ్ ఎగ్‌నాగ్
కోన్యాక్ బ్రాందీ: 30 మి.లీ.
ఐరిష్ విస్కీ: 20 మి.లీ.
పాలు: 90 మి.లీ.
క్రీమ్: 60 మి.లీ.
గుడ్డు: ఒకటి
పంచదార: 2 టేబుల్ స్పూన్లు
గార్నిష్: లవంగాలు, దాల్చిన చెక్క
- వైన్‌తేయుడు