విలువైన కొలువులకు నెలవులు | railway exam preparation | Sakshi
Sakshi News home page

విలువైన కొలువులకు నెలవులు

Published Thu, Nov 6 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

విలువైన కొలువులకు నెలవులు

విలువైన కొలువులకు నెలవులు

రైల్వే పరీక్షలు
 
 భారతీయ రైల్వేలో ముఖ్యంగా నాలుగు రకాల ఉద్యోగాలు ఉంటాయి. అవి గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి. గ్రూప్-ఎ ఉద్యోగాలను యూపీఎస్సీ ద్వారా, గ్రూప్-బి ఉద్యోగాలను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తా రు. గ్రూప్-డి ఉద్యోగ నియామకాలకు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇక ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ చేసే గ్రూప్ సి ఉద్యోగాలను టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలుగా విభజించారు.
 
 ఆర్‌ఆర్‌బీ-టెక్నికల్
 విద్యార్హత: ఐటీఐ
 ఉద్యోగాలు: అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్స్.
 వయస్సు: అన్‌రిజర్‌‌వడ్: 18-30 ఏళ్లు; ఓబీసీ: 33 ఏళ్లు (+3 ఏళ్లు); ఎస్సీ: 35 ఏళ్లు (+5 ఏళ్లు); ఎస్టీ: 35 ఏళ్లు (+5 ఏళ్లు).
 గమనిక: అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగానికి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌ల్లో డిప్లొమా పూర్తిచేసిన వారు, బీటెక్ ఉత్తీర్ణులు కూడా అర్హులు.
 
 పరీక్ష విధానం: అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగానికి రెండు రకాల పరీక్షలు జరుగుతాయి. 1.
 
 రాత పరీక్ష. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే, జనరల్ అవేర్‌నెస్ (పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ), స్థానిక సాధారణ పరిజ్ఞానం అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 100 ప్రశ్నలుంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. రెండోది-సైకాలజీ/ఆప్టిట్యూడ్ టెస్ట్. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. చివర్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
 
 టెక్నీషియన్స్ ఉద్యోగాలకు రాత పరీక్ష మాత్రమే ఉంటుంది.
 
 విద్యార్హత డిప్లొమా:

 జూనియర్ ఇంజనీర్ (జేఈ) ఉద్యోగాలకు డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వీటికి బీటెక్ పూర్తయిన వారు కూడా అర్హులే.
 బీటెక్: సెక్షన్ ఇంజనీర్ (ఎస్‌ఈ) ఉద్యోగాలకు బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు.
 
 పరీక్ష విధానం:
 జేఈ, ఎస్‌ఈ ఉద్యోగాలను రాత పరీక్ష ఆధారంగా భర్తీచేస్తారు. ఇందులో ముఖ్యంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్, జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్థానిక సాధారణ పరిజ్ఞానం నుంచి ప్రశ్నలు వస్తాయి. 150 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
 
 నాన్ టెక్నికల్:
 పదో తరగతి: టికెట్ కలెక్టర్, జూనియర్ క్లర్క్, ట్రెయిన్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్; ఇంటర్ ఎంపీసీ: ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటైనర్ (ఈఎస్‌ఎం); డిగ్రీ: అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్స్, ఎంక్వయిరీ కమ్ రిజర్వేషన్ క్లర్స్, సీనియర్ క్లర్క్, ట్రాఫిక్ అప్రెంటీస్, కమర్షియల్ అప్రెంటీస్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్.

 పరీక్ష విధానం:
 అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి రాత పరీక్ష, సైకాలజీ/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇతర ఉద్యోగాలకు కేవలం రాత పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు.
 
 రాత పరీక్షలో అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్, స్థానిక ప్రాంత పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. 100ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
 
 ఆర్‌ఆర్‌సీ గ్రూప్-డీ:
 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
 ఉద్యోగాలు: గ్యాంగ్‌మెన్, హెల్పర్-2, ట్రాక్‌మెన్, కలాసి.
 రాత పరీక్ష: అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. రాత పరీక్ష తర్వాత దేహ దారుఢ్య పరీక్ష ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
 
 జోన్ అధికార భాషలో:
 ప్రస్తుతం రైల్వే శాఖ సెంట్రల్ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో జోన్ల వారీగా ఖాళీలను గుర్తించి ఆయా జోన్ల పరిధిలోని అభ్యర్థులకు ఖాళీలను కేటాయిస్తోంది. అంతేకాక ఆ జోన్‌కు చెందిన అధికార భాషలో కూడా పరీక్ష రాసే వీలు కల్పిస్తోంది.
 
 సన్నద్ధత
 వివిధ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ అంశాలకు ప్రాధాన్యముంటుంది. అర్థమెటిక్‌లో లాభ- నష్టాలు, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం తదితర అంశాల సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్‌లో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్‌మెంట్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకేలో రైల్వే వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలతోపాటు.. జాతీయ చిహ్నాలు, అంతర్జాతీయ సరిహద్దులు, ఐక్యరాజ్యసమితి, పరిశోధన సంస్థలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ప్రపంచం/ఇండియాలో తొలి, ఎత్తై, పొడవైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. వర్తమాన వ్యవహారాల కోసం రోజూ దినపత్రికలు, మేగజీన్లను చదవాలి.
 
 టెక్నికల్ సబ్జెక్ట్: ఈ విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఒక బ్రాంచ్‌కు చెందిన విద్యార్థి మరికొన్ని ఇతర బ్రాంచ్‌లకు సంబంధించిన అంశాలపైనా పట్టుసాధించాల్సి ఉంటుంది.
 - ఎ.సత్యనారాయణరెడ్డి, డెరైక్టర్, గ్రేట్ ఇన్‌స్టిట్యూట్,సికింద్రాబాద్.
 
 ఎస్‌ఎస్‌సీ
 
 భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) క్రమం తప్ప కుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు వరప్రదాయినిగా నిలుస్తోంది. లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ),గ్రాడ్యుయే ట్ లెవెల్ ఆడిటర్స్,జూనియర్ అకౌంటెంట్స్, అప్పర్ డివిజన్ క్లర్క్స్(యూడీసీ) వంటి ఉ ద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తోంది. ఏటా వివిధ విభాగాల నుంచి అందే ఖాళీలకు అనుగుణంగా ఓపెన్ లెవెల్, డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు ప్రకటనలు వెలువడుతున్నాయి.
 
 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎగ్జామినేషన్: డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత: 10+2 లేదా తత్సమానం.
 
 కంబైన్డ్ మెట్రిక్ లెవెల్: స్టెనో గ్రేడ్-సి; స్టెనో గ్రేడ్-డి; ఎల్‌డీసీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత: 10+2 లేదా తత్సమానం.
 
 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్: ఇన్‌కం ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్ విభాగాల్లో ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు, సీబీఐలో సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు, డివిజనల్ అకౌంటెంట్స్, ఆడిటర్స్, యూడీసీ తదితర పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
 
 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్: కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
 
 ఎస్‌ఐ (సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్): కేంద్ర పోలీస్ సంస్థలో సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
 
 సెక్షన్ ఆఫీసర్ (ఆడిట్) ఎగ్జామినేషన్: సెక్షన్ ఆఫీసర్ (ఆడిట్) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
 
 సెక్షన్ ఆఫీసర్ (కమర్షియల్ ఆడిట్ ఎగ్జామినేషన్): సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత: కామర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ; సీఏ; ఐసీడబ్ల్యూఏ, సీఎస్.
 
 ట్యాక్స్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగాల్లో ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, నిర్దేశ డేటా ఎంట్రీ స్పీడ్ ఉండాలి.
 
 స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ గ్రేడ్-4 ఎగ్జామినేషన్: స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విభాగాల్లో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు. అర్హత: స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కామర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ. స్టాటిస్టిక్స్ ఒక ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి.
 
 జూనియర్ ఇంజనీర్ (సివిల్ అండ్ ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్: సివిల్ లేదా ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా లేదా తత్సమాన అర్హత.
 
 మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్): మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు. అర్హత: పదో తరగతి.
 
 బ్యాంకింగ్ vs ఎస్‌ఎస్‌సీ

 
పరీక్షల స్వభావంలో సారూప్యత ఉన్న నేపథ్యంలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వారు అర్హతలను బట్టి బ్యాంకు పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సబ్జెక్టుల వారీగా సిలబస్, కాఠిన్యత స్థాయిపై అవగాహన పెంపొందించుకొని పటిష్ట ప్రణాళిక ప్రకారం సిద్ధమవాలి.
 
 పరీక్ష - ఐబీపీఎస్ పీవో 20-30 ఏళ్లు (మినహాయింపు వర్తిస్తుంది)
 విద్యార్హత - బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన
 
 పరీక్ష -ఐబీపీఎస్ క్లర్క్ 20-28 ఏళ్లు (మినహాయింపు వర్తిస్తుంది)
 విద్యార్హత -బ్యాచిలర్ డిగ్రీ  లేదా తత్సమాన
 
 పరీక్ష -ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ 18-27 (మినహాయింపు వర్తిస్తుంది)
 విద్యార్హత -బ్యాచిలర్ డిగ్రీ  లేదా తత్సమాన
 
 పరీక్ష -ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ 18-27 (మినహాయింపు వర్తిస్తుంది)
 విద్యార్హత -గ్రాడ్యుయేషన్ (చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు
 చేసుకోవచ్చు
 
 పరీక్ష -ఎస్‌ఎస్‌సీ 10+2 18-27 (మినహాయింపు వర్తిస్తుంది)
 విద్యార్హత -12th ఉత్తీర్ణత.
 
 పరీక్ష విధానం:
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్‌లో కొన్ని ఉద్యోగాలను రాత పరీక్ష, ఇంటర్వ్యూఅండ్ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. మరికొన్ని ఉద్యోగాలకు రాత పరీక్ష ఒక్కటే నిర్వహిస్తారు. సీజీఎల్‌ఈ ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. అవి.. మొదటి, రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్. ఈ మూడు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు. రాత పరీక్షను టైర్-1, టైర్-2 అనే రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది.
 
 అధిక స్కోరే లక్ష్యంగా ఉండాలి

 ఎస్‌ఎస్‌సీలో కీలకమైన పరీక్ష కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ సబ్జెక్టులుంటాయి. ప్యూర్ మ్యాథ్స్ నుంచి 20-30 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలకు వీలైనంత తక్కువ సమయంలో సమాధానాలు గుర్తిస్తే ఆదా అయిన సమయాన్ని మిగిలిన విభాగాలకు ఉపయోగించుకోవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే జనరల్ అవేర్‌నెస్‌లో 30-40 మధ్య స్కోర్ చేయొచ్చు. రీజనింగ్‌లో 45కు తగ్గకుండా మార్కులు పొందొచ్చు. కేవలం కటాఫ్‌ను దాటడం అనే దాన్ని లక్ష్యంగా పెట్టుకోకుండా వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు నచ్చిన సర్వీస్‌ను చేజిక్కించుకోవచ్చు.
 

-ఎన్. వినయ్‌కుమార్ రెడ్డి,  డెరైక్టర్, ఐఏసీఈ, హైదరాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement