Spoken English
చాలామంది కొన్ని పదాలు మాత్రమే తెలుసుకొని వాటినే అనేక భావాలకు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు..
సందర్భం-1: సంజయ్, ప్రియ చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మాటల సందర్భంలో ‘నీకు బట్టతల వస్తోంది’ అని ప్రియ.. సంజయ్‌తో అనాలనుకుంది. కానీ ఇలా అంది..
Priya: You bald head ummmm.. Bald head is comming to you. : Lol (నవ్వుతున్నాడు) బట్టతలని bald head అంటారని ప్రియ తెలుసుకుంది కానీ ‘బట్టతల రావడాన్ని’ ఏమంటారో తెలుసుకోలేదు. అందువల్ల తనకి తెలిసిన ఛ్చఛీ జ్ఛ్చిఛీ అనే పదాన్ని ఉపయోగించే మాట్లాడాలని ప్రయత్నించింది. కానీ ఇంగ్లిష్‌లో you are going bald అంటారు. బట్టతల రావడాన్ని go bald, went bald, gone bald, going bald, goes bald అని ఐదు రూపాల్లో చెబుతారు. వీటిలో ఏ సందర్భానికి ఏది సరిపోతుందో దాన్నే వాడతారు. చాలా సందర్భాల్లో auxilliariesతో కలిపి మాట్లాడాల్సి వస్తుంది. ఇంగ్లిష్ వొకాబులరీకి సంబంధించి ‘బట్టతల’ వేరు, ‘బట్టతల రావడం’ వేరు.
అలాగే సంఘటన జరిగి చాలా కాలం గడిచిపోతే దాన్ని Present perfect tenseలో చెప్పకూడదని గట్టిగా నమ్ముతుంటారు. ఈ అపోహను తొలగించుకుందాం..
సందర్భం-2:ఆజాద్.. ప్రమాదవశాత్తూ 1945లో కోమాలోకి వెళ్లారు. 1965లో కోమా నుంచి బయటపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆనందంగా చుట్టూ చేరారు. ఆయన మాత్రం తన చుట్టూ ఏం జరిగిందో గమనించకుండా ఇలా అన్నారు..
ఆజాద్: I must go out and participate in the freedom movement (నేను బయటకు వెళ్లి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలి)
ఆజాద్ కుమారుడు: Father, we have gained independence. (నాన్నా మనం స్వాతంత్య్రం సంపాదించుకున్నాం)
పై సంభాషణలో ఆజాద్ కుమారుడు Present perfec్ట వాడారు. ‘నాన్నా మనం ఇంకా బ్రిటిష్ పాలనలో లేం’ అని చెప్పడమే అతని ఉద్దేశం. ‘ఇప్పటికీ (Present వరకు అంటే 1965 వరకు) బ్రిటిష్ పాలనే కొనసాగుతోందని మీరనుకుంటున్నారు. అది నిజం కాదు’ అని చెప్పడం మాత్రమే అతని ఉద్దేశం.
అందువల్ల Present perfect tense వాడారు. అంతేకానీ స్వాతంత్య్రం వచ్చి 18 ఏళ్లు గడిచిపోయింది కదా అని ్క్చట్ట టజీఝఞ్ఛ వాడలేదు. అసలు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందో చెప్పాల్సిన అవసరం ఆ క్షణంలో అతనికి రాలేదు. అready వచ్చేసింది అని చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. భాషకి (tenseMìS) చెప్పాలనుకున్న ఉద్దేశంతో మాత్రమే పని. 1947లో మనకి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు Past simple tenseలో చెబుతారు.
రామేశ్వర్ గౌడ్
ఇంగ్లిష్ కార్పొరేట్,
సెలబ్రిటీ ట్రైనర్