సిలబస్-ప్రిపరేషన్ ప్రణాళిక
టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్స్
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీస్‌లో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.మొత్తం ఖాళీలు: 123వేతన స్కేలు: రూ.22,460-రూ.66,330.అర్హత: డీసీఈ/ ఎల్‌సీఈ/ ఎల్‌ఏఏలో డిప్లొమా లేదా బీఆర్క్ లేదా బీఈ/ బీటెక్ (సివిల్) లేదా బీప్లానింగ్/బీటెక్ ప్లానింగ్.వయసు: 2015, జూలై 1 నాటికి కనిష్ట వయసు 18 ఏళ్లు. గరిష్ట వయసు 44 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.ఎంపిక విధానం: ఆన్‌లైన్ లేదా ఓంఎఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
రాత పరీక్ష
(ఆబ్జెక్టివ్ టైప్) {పశ్నలు సమయం మార్కులు
పేపర్: 1 -
జనరల్ స్టడీస్ అండ్
జనరల్ ఎబిలిటీస్ 150 150 ని. 150
పేపర్: 2-ఇంటర్మీడియెట్
ఒకేషనల్ స్థాయి) 150 150 ని. 150
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 19, 2015
పరీక్ష తేదీ: నవంబరు 22, 2015.
పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్‌సైట్: www.tspsc.gov.in
సిలబస్ వివరాలు
అన్ని ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ ఉమ్మడిగా ఉంది. స్వల్ప మార్పులతో సిలబస్ ఒకే విధంగా ఉంది.
వర్తమాన వ్యవహారాలు (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ)
అంతర్జాతీయ వ్యవహారాలు
జనరల్ సైన్స్, శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ విజయాలు
పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ
భారత, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
భారత జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ (ఫిజికల్, సోషల్, ఎకనమిక్)
ఆధునిక భారతదేశ చరిత్ర (భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం)
తెలంగాణ సామాజిక- ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర (తెలంగాణ ఉద్యమం, రాష్ర్ట ఏర్పాటుకు ప్రాధాన్యం)
భారత రాజ్యాంగం; తెలంగాణ సమాజం-సంస్కృతి- వారసత్వం, సాహిత్యం; తెలంగాణ రాష్ట్ర విధానాలు; లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్.ఉంటుంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షకు పదో తరగతి స్థాయిలో ఉంటుంది.జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కు పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ఉపయోగపడతాయి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌కు ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలను రిఫరెన్స్‌గా ఉపయోగించుకోవచ్చు.
పేపర్-2 అసిస్టెంట్ (ఫైనాన్స్, అకౌంట్స్):
డిగ్రీ స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్‌లో అకౌంటింగ్ ప్రాథమిక భావనలు, బుక్ కీపింగ్, భాగస్వామ్య ఖాతాలు, కార్పొరేట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్‌కం ట్యాక్స్, వ్యాపార సంస్థ-ప్రాథమిక అంశాలు, వివిధ రకాల వ్యాపార చట్టాలు, ఆడిటింగ్ తదితర అంశాలుంటాయి. కంప్యూటర్స్‌కు సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్; ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్స్‌ఎల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్, ఈ-కామర్స్ అంశాలుంటాయి. టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్స్:ఇంటర్మీడియెట్ ఒకేషనల్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్‌లో ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నంబరింగ్, డ్రాయింగ్ (బ్రిక్ అరేంజ్‌మెంట్, ఫ్లోరింగ్ టైప్స్, ఎలివేషన్...), సర్వేయింగ్, ఫీల్డ్ బుక్ ఎంట్రీస్, ప్లాటింగ్, కాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాస్ వంటి అంశాలున్నాయి.
మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్:
ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి డిప్లొమా స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్‌లో థర్మల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్, ఆటోమొబైల్ సర్వీసింగ్ అండ్ మెయింటెనన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, స్పెషల్ పర్పస్ వెహికల్స్, బేసిక్ హైడ్రాలిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ వంటి అంశాలుంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ (ఆబ్జెక్టివ్)- ఆర్.కె.జైన్, రాజ్‌పుట్, జైన్ అండ్ జైన్ పుస్తకాలు రిఫరెన్సుకు ఉపయోగపడతాయి.
ప్రిపరేషన్ టిప్స్
ప్రిపరేషన్ సమయంలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సినాప్సిస్‌తో నోట్స్ రూపొందించుకోవాలి. ఇది చివరి దశలో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.క్లిష్టమైన అంశాలను చదివేటప్పుడు గ్రూప్ స్టడీ వల్ల ప్రయోజనం ఉంటుంది. వీలైనన్ని మోడల్ టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల పరీక్ష సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పెద్ద నిర్వచనాలు, ఫార్ములాలు, స్టేట్‌మెంట్లను చిన్న కోడ్‌ల ద్వారా గుర్తుంచుకోవాలి.తెలిసిన అంశాల నుంచి కూడా ఊహించని విధంగా పరోక్షంగా ప్రశ్నలు ఎదురుకావొచ్చు. అందువల్ల ఇంపార్టెంట్ అనే దృక్పథాన్ని విడిచిపెట్టి, ప్రతి అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి.పరీక్షకు కనీసం వారం ముందు నుంచి రివిజన్ ప్రారంభించాలి. ఆ సమయంలో కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించకకూడదు.