450 మంది అమితాబ్‌లు... 7 వేల మంది గబ్బర్ సింగ్‌లు... | 450 amitab bachchan in uttarpradesh | Sakshi
Sakshi News home page

450 మంది అమితాబ్‌లు... 7 వేల మంది గబ్బర్ సింగ్‌లు...

Published Mon, Apr 21 2014 1:45 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

450 మంది అమితాబ్‌లు...  7 వేల మంది గబ్బర్ సింగ్‌లు... - Sakshi

450 మంది అమితాబ్‌లు... 7 వేల మంది గబ్బర్ సింగ్‌లు...

 అమితాబ్ బచ్చన్... బాలీవుడ్ సూపర్‌స్టార్‌గా అందరికీ పరిచితమైన పేరు... ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితాలో ఇదే పేరుతో ఏకంగా 450 మంది ఉన్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్‌హిట్ సినిమా ‘షోలే’లోని పాత్రల పేర్లు సైతం ఓటర్ల జాబితాలో లెక్కకు మిక్కిలిగా నమోదయ్యాయి. ‘షోలే’ విలన్ గబ్బర్ సింగ్ పేరుతో ఏకంగా 7,040 మంది ఉన్నారు.
 
 ‘షోలే’లో ప్రముఖ పాత్రలైన జయ్, వీరూ, బసంతి పేర్లు గల వారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. హర్యానా ఓటర్ల జాబితాలో ఒక ‘మిస్టర్ ఇండియా’ ఉండగా, ‘రోబో’ పేరుతో దాదాపు ఐదువేల మంది, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ చిత్రంలో అమితాబ్ పాత్ర పేరైన ఆంథోనీ గొన్సాల్వెస్ పేరుతో 160 మంది ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement