ఎన్నికల పండగకు చీరల వ్యాపారం... | The festival   City Business ... | Sakshi
Sakshi News home page

ఎన్నికల పండగకు చీరల వ్యాపారం...

Published Sun, Apr 20 2014 2:05 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

ఎన్నికల పండగకు  చీరల వ్యాపారం... - Sakshi

ఎన్నికల పండగకు చీరల వ్యాపారం...

ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల పల్లెల్లో పండగ పబ్బాలకు, పెళ్లిళ్లు వంటి వేడుకలకు మాత్రమే కొత్తచీరలు ధరించి, నిండుగా అలంకరించుకుంటారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలనూ వారు పండుగగానే పరిగణిస్తారు. కొత్త చీరలతో అలంకరించుకుని పోలింగ్ బూత్‌లకు వెళతారు. ఎన్నికల సీజన్‌ను గమనించి జౌన్‌పూర్ ప్రాంతానికి చెందిన కొందరు స్కూలు విద్యార్థులు, కొద్ది మంది కాలేజీ విద్యార్థులు బృందంగా ఏర్పడి చీరల వ్యాపారం ప్రారంభించారు. గ్రామ గ్రామానికి, ఇంటింటికీ తిరుగుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. వీరి వ్యాపారం జోరుగా సాగుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ శాతం భారీగా నమోదు కావచ్చని అంచనాలు వేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement