జిల్లాలో పెరిగిన ఓటర్లు 55,804 | 55.804 voters in the district increased | Sakshi
Sakshi News home page

జిల్లాలో పెరిగిన ఓటర్లు 55,804

Published Thu, Apr 24 2014 1:45 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

55.804 voters in the district increased

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:  సార్వత్రిక ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధమైంది. బుధవారం అధికారులు ప్రకటించిన ఈ జాబితా ప్రకారం జిల్లాలో 55,804 మంది ఓటర్లు పెరిగారు. ప్రాదేశిక ఎన్నికల సమయంలో ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో 19,29,435 మంది ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటర్లుగా నమోదయ్యారు. దాంతో జిల్లా ఓటర్ల సంఖ్య 19,85,239కు పెరిగింది. ఓటర్లుగా నమోదు కాని వారికి సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు వీలుగా ఈ నెల 9వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా 82 వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
 క్షేత్రస్థాయి విచారణ అనంతరం 55,804 మంది దరఖాస్తుదారులకు ఓటు హక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితాలో చేర్చారు. కొత్త జాబితాలో పేర్లు ఉన్న వారందరూ వచ్చే నెల 7వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయవచ్చని అధికారులు ప్రకటించారు. కొత్త జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 19,85,239 కాగా.. వీరిలో పురుషులు 9,92,031 మంది, మహిళలు 9,93,032 మంది, ఇతరులు 176 మంది ఉన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 8882 మంది ఓటర్లు చేరారు. పాలకొండలో 4049 మంది నమోదయ్యారు. ఇచ్ఛాపురంలో 8458 మంది, పలాసలో 7838 మంది, రాజాంలో 5262 మంది, పాతపట్నంలో 5519 మంది, ఆమదాలవలసలో 4379 మంది ఓటర్లు కొత్తగా చేరారు. టెక్కలి, ఎచ్చెర్ల, నరసన్నపేటల్లో మూడు వేలకుపైగా ఓటర్లు పెరిగారు. కొత్త జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఈ రెండు వర్గాల ఓటర్ల మధ్య వెయ్యి ఓట్ల తేడాయే ఉంది.
 
 సెగ్మెంట్లవారీగా తాజా ఓటర్ల వివరాలు
 సెగ్మెంట్ పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం
 ఇచ్చాపురం 109593 114558 13 224164
 పలాస 94060 96000 39 190099
 టెక్కలి 102941 101573 8 204522
 పాతపట్నం 96385 95446 13 191844
 శ్రీకాకుళం 113735 114029 29 227793
 ఆమదాలవలస 87124 86406 17 173547
 ఎచ్చెర్ల 106471 103736 17 210224
 నరసన్నపేట 97818 97860 12 195690
 రాజాం 101182 98030 18 199230
 పాలకొండ 82722 85394 10 168126
 మొత్తం 992031 993032 176 1985239
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement