శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మరో రోజు వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. శుక్రవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో రెండు చోట్ల లెక్కింపు జరుగుతుంది. చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్ కళాశాల సముదాయంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పాలకొండలోని ప్రాథమిక వ్యవసాయ పరిపతి కేం ద్రంలో ఆ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 20 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో పరిశీలకుడు, లెక్కింపు సహయకులు, లెక్కింపు పరిశీలకులు ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వంద గజాల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు. పోలింగుకు ఈవీఎంలు వినియోగించినందున తక్కువ సిబ్బందితో, వేగంగా లెక్కింపు జరిగే అవకాశం ఉంది.
మధ్యాహ్నానికే ఫలితాలు స్తాయని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది సెల్‌పోన్లు తీసుకురాకూడదు. అలాగే కౌంటింగ్ సిబ్బంది. అభ్యర్థుల ఏజెంట్లు సంబందిత రిట ర్నింగ్ ఆధికారులు జారీచేసిన గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.ఈ నెల ఏడో తేదీన జరిగిన సార్వత్రిక పోలింగులో జిల్లాలో 14,89,087 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 7,22,764 మంది పురుషులు కాగా 7,66,323 మంది మహిళలు ఉన్నారు. పురుషుల్లో 72.85 శాతం, మహిళల్లో 77.17 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో జిల్లా సగటు ఓటింగ్ శాతం 75.01గా నమోదైంది. కాగా జిల్లాలో ఒక లోక్‌సభ, పది శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మొత్తం 94 మంది అభ్యర్థులు పోటీ చేశారు. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో 10 మంది, పది అసెంబ్లీ సీట్లలో 84 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారి భవిష్యత్తు శుక్రవారంనాటి కౌంటింగ్‌లో తేలనుంది.
కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు
Published Thu, May 15 2014 1:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement