రజనీ కాంత్, మోడీలు కలుస్తారా?
తమిళనాట రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ హల్ చల్ చేసి చివరి నిమిషంలో పక్కకు తప్పుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సారి కూడా ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యారు.
నరేంద్ర మోడీ ఆదివారం నరేంద్ర మోడీని కలుసుకునే అవకాశం ఉంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వస్తున్న నరేంద్ర మోడీని రజనీకాంత్ కలుసుకుంటారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. తుగ్లక్ పత్రిక సంపాదకుడు, ఒకప్పటి సినీ నటుడు చో రామస్వామి వీరిద్దరినీ కలుపుతున్నారు. బిజెపి తమిళనాడు వ్యవహారాల ఇన్ చార్జి మురళీధర రావు కూడా మోడీ, రజనీ మీటింగ్ జరిగే అవకాశం ఉందని అన్నారు.
రజనీకాంత్ గత లోకసభ ఎన్నికల సమయంలో అద్వానీ ఆత్మకథను తమిళనాట ఆవిష్కరించారు. అద్వానీతో పాటు కలిసి ఒకే వేదికపై ఆయన దర్శనమిచ్చారు. అయితే ఆ తరువాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితం మోడీ తమిళనాట సభలో పాల్గొన్నప్పుడు కూడా రజనీ ఆయన్ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరికి అది ఉత్తుత్తిదేనని తేలిపోయింది.