నాలుగు కోట్లతో దొరికేసిన నాయకుడు!! | BSP leader in UP found with Rs 4 crore cash, booked | Sakshi
Sakshi News home page

నాలుగు కోట్లతో దొరికేసిన నాయకుడు!!

Published Tue, Apr 8 2014 1:49 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

నాలుగు కోట్లతో దొరికేసిన నాయకుడు!! - Sakshi

నాలుగు కోట్లతో దొరికేసిన నాయకుడు!!

ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు ఈసీ వర్గాలు, పోలీసులు కలిసి 10 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంటే, ఒకే ఒక్క సంఘటనలో మరో 4 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తుండగా బీఎస్పీ నాయకుడు ఒకరి వద్ద 4 కోట్లు దొరికాయి. మీరట్ శాస్త్రినగర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీఎస్పీ నాయకుడు నదీం, అతడి అనుచరుడు మెరాజ్ కలిసి ఘజియాబాద్ వెళ్తుండగా ఈసీ వర్గాలు ఆయన కారు తనిఖీ చేశాయి. ఆయన వద్ద 4 కోట్లున్నాయి.

అంత పెద్ద మొత్తం ఎందుకు తీసుకెళ్తున్నారని అడగ్గా, ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆదాయపన్ను శాఖ అధికారులు నదీం ఇంట్లో సోదాలు చేసినా, ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల కోసమే ఈ సొమ్ము తీసుకెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement