జెడ్పీటీసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగింది. జిల్లాలో 57 స్థానాలుం డగా, టీఆర్‌ఎస్ 41 సీట్లు గెల్చుకుని సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీ భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమైంది. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జెడ్పీ పీఠాన్ని అధిష్టించే అదృష్టవంతురాలెవరు? అనే విషయంపై ఇటు ప్రజల్లో.. అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, జిల్లా పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. జెడ్పీ చరిత్రలో ఈ సీటు వుహిళలకు రిజర్వు కావటం ఇదే తొలిసారి.
అలాగే జిల్లాలోని పన్నెండు జెడ్పీటీసీ స్థానాలు తివ్మూపూర్, రావుడుగు, గంగాధర, ఎలిగేడు, వుల్యాల, రారుుకల్, ధర్మపురి, గొల్లపల్లి, కథలాపూర్, వుల్లాపూర్, కోనరావుపేట, గంభీరావుపేట జెడ్పీటీసీ స్థానాలు బీసీ వుహిళలకు రిజర్వు అయ్యాయి. వురో పన్నెండు స్థానాలు వుుత్తారం, కాటారం, ఎల్లారెడ్డిపేట, వెల్గటూరు, ధర్మారం, వుల్హర్, వూనకొండూరు, చిగురువూమిడి, రావుగుండం, చొప్పదండి, జమ్మికుంట, కవూన్‌పూర్ బీసీ జనరల్‌కు కేటాయించారు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన స్థానాలతో పాటు బీసీ జనరల్ స్థానాల నుంచి కూడా చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్న మహిళలు పోటీకి దిగి గెలుపొందారు. టీఆర్‌ఎస్ నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థులుగా పార్టీ హామీ ఇచ్చిన, ప్రచారం జరిగిన అభ్యర్థులంతా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే రేసు నుంచి తప్పుకొని కథలాపూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీచేసిన టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ ఆ స్థానం నుంచి గెలుపొందారు. రామడుగు నుంచి వీర్ల కవిత, జూలపల్లి నుంచి ప్రీతి రఘువీర్‌సింగ్, తిమ్మాపూర్ నుంచి ఉల్లెంగుల పద్మ, గంభీరావుపేట నుంచి మల్లుగారి పద్మ విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ రావడంతో చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పార్టీ అధిష్టానం కనుసన్నల్లో జరగనుంది.
చైర్‌పర్సన్ రేసులో ప్రముఖంగా తుల ఉమ పేరు వినపడుతుండగా, మిగిలిన వారు సైతం అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమం నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన తుల ఉమ.. ఆ తరువాత మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలను అంకితభావంతో నిర్వహిస్తారనే పేరుండటం, వివాద రహితురాలు కావడం, పార్టీ హైకమాండ్‌కు విధేయురాలుగా ఉండటంతో ఆమెకే జెడ్పీ పీఠం దక్కుతుందనే వాదనలు టీఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తుల ఉమ తరువాతనే తమకు అవకాశం ఉంటుందని చైర్‌పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థులు చెబుతుండటం విశేషం.
చైర్‌పర్సన్ రేసులో..
Published Wed, May 14 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement