huge majority
-
భారీ మెజారిటీతో వికసించిన కమలం
-
భారీ మెజారిటీతో వికసించిన కమలం
-
తిరుపతి ఉప ఎన్నిక: చెక్కు చెదరని వైఎస్సార్సీపీ ఓట్ షేర్
కుట్రలు కూలిపోయాయి.. అసత్య ప్రచారాలు అణిగిపోయాయి.. మొత్తంగా ప్రతిపక్షాలు దుర.. ‘ఆశలు’ ఆవిరయ్యాయి. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో ‘నవ’సంక్షేమానికి పట్టం గట్టిన ఓటర్లు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరోమారు గంపగుత్తుగా జైకొట్టి.. జగనన్న జైత్రయాత్రకు మద్దతుపలికారు. సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ, జనసేన కుట్ర భగ్నమైంది. వారి దుష్ప్రచారాలకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చెదరకపోగా.. తిరుపతి, శ్రీకాళహస్తిలో ఇంకా పెరిగాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు.. ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి భారీ మెజారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుత ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం అందుకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంకి డిపాజిట్ కూడా దక్కలేదు. జనసేనతో పొత్తు కారణంగా టీడీపీకి వెళ్లే ఓట్లను బీజేపీ లాక్కున్నట్లయ్యింది. మొత్తంగా ఈ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్సీపీకి అఖండ మెజారిటీని అందించి విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారు. ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందటంతో తిరుపతి పార్లమెంట్‌కు ఉప ఎన్నిక తప్పనిసరైంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో ఓటింగ్‌పై కొంత ప్రభావం చూపింది. మొదట్లో 50శాతం కూడా పోలింగ్ జరగదని భావించినా 64.28 శాతం మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుని శభాష్ అనిపించుకున్నారు. 17వ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. రెండు చోట్ల భారీగా పెరిగిన ఓట్ షేర్ తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీనే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కోసం కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేశారు. మూడు నెలలుగా తిష్టవేసి కుట్రలు, కుతంత్రాలకు పథకం రచించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా రాళ్లదాడి చేశారంటూ కొత్త డ్రామాకు తెరతీశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు.. రౌడీలు, గూండాలంటూ రెచ్చిపోయారు. సత్యవేడులో సాధారణంగా కరెంట్ కట్ అయితే.. అది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనే అని ఆరోపించారు. కుప్పంలో మతిస్థిమితం లేని మహిళ ఆలయంలో చేసిన పొరపాటునూ.. వైఎస్సార్సీపీకి ఆపాదించి విమర్శలు చేశారు. శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అయినా తిరుపతి, శ్రీకాళహస్తిలో ఓట్ షేరింగ్ గతంకంటే పెరగడం గమనార్హం. దీంతో విపక్షాలు పూర్తి ఆత్మరక్షణలో పడిపోయాయి. నవరత్నాలతోనే ప్రజల్లోకి.. విపక్ష పార్టీలు వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతుంటే.... ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో నవరత్నాలు, సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి వాణిరెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి ఊరూరా ప్రచారం చేశారు. అనుకున్నట్టే తిరుపతి, శ్రీకాళహస్తిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లకంటే అధికంగా వచ్చాయి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వీధి.. వీధి.. తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఫలితంగా 34 వేల ఓట్లు అధిక్యం వచ్చింది. దీంతో చేసేదిలేక.. టీడీపీ, బీజేపీ నాయకులు దొంగ ఓట్లు అంటూ.. దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వెయ్యికిపైగా వైఎస్సార్సీపీ అభ్యర్థికి అదనంగా రావడం విశేషం. చదవండి: Tirupati Election Results 2021: ‘ఫ్యాన్’ హ్యాట్రిక్ ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ -
ఇక మెజారిటీ కోసమే!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో ఘన విజయం తమదేనని, కేవలం భారీ మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నామంటూ అధికార టీఆర్ఎస్ ప్రకటనలు చేస్తోంది. విపక్షాల అభ్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేలా ‘మైండ్ గేమ్’ మొదలుపెట్టింది. ఈ ఎన్నికలపై ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న గులాబీ నాయకత్వం... తొలుత అభ్యర్థుల ఖరారు సమయంలో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకడం లేదంటూ విమర్శించింది. ఇప్పుడు గెలుపు తమదేనని, తమ అభ్యర్థికి మెజారిటీ పెంచడం కోసమే ప్రచారం చేస్తున్నామని చెబుతోంది. ‘టీఆర్ఎస్ మైండ్ గేమ్ అడుతోంది. ప్రత్యర్థి పార్టీలతో ఒక విధంగా మానసిక యుద్ధం చేస్తోంది. విపక్షాలు ముందే చేతులెత్తేశాయన్న అభిప్రాయాన్ని ఓటర్లలో కలిగించేలా పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది..’’ అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యూహం మేరకు టీఆర్ఎస్ నేతలంతా మెజారిటీ కోసమే తమ పోరాటమని చెబుతున్నారు. టీఆర్ఎస్ నాయకత్వం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పజెప్పింది. అయినా ప్రస్తుతానికి వరంగల్ జిల్లా నాయకులే ఎక్కువగా ప్రచారంలో ఉన్నారు. ఎన్నికల బాధ్యతలున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్ తదితరులు ఇతర కార్యక్రమాల్లో ఉండి, గురువారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. దీపావళి తర్వాతే మంత్రులు వరంగల్‌లో ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మారిన రాజకీయ వాతావరణం తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వరంగల్ ఉప ఎన్నికల రాజకీయ వాతావరణాన్ని మార్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్ బరిలోకి దింపిన సర్వే సత్యనారాయణ స్థానికుడు కాదు. ఇది తమకు లాభించే అంశమన్న భరోసా టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. వాస్తవానికి బుధవారం తమ అభ్యర్థి చేత మరోసారి నామినేషన్ వేయించేందుకు, దీనికి కోసం భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించి హడావుడి చేసేందుకు టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఘటనతో భారీ సమీకరణ లేకుండానే కార్యక్రమాన్ని ముగించింది. ‘స్థానికత’పై ధీమా! పార్టీ ఆవిర్భావం నుంచి తమతో కలసి నడిచిన సామాన్య కార్యకర్త, స్థానికుడికి టికెట్ కేటాయించామని అధికార పార్టీ చె ప్పుకుంటోంది. పేద కార్యకర్త అయినందున ఎన్నికల ఖర్చులను పార్టీయే భరిస్తోందంటూ రూ.70 లక్షల చెక్కునూ అందజేసి... ఈ అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో అత్యధిక ఓట్లున్న మాదిగ వర్గానికి చెందిన స్థానిక నేతకు అవకాశమిచ్చామని పదేపదే చెబుతోంది. దీనికితోడు కాంగ్రెస్‌లో అభ్యర్థి మారిపోయి స్థానికేతరుడైన సర్వే సత్యనారాయణ పోటీకి దిగడంతో ప్రచారానికి మరింత పదును పెడుతోంది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి ఎన్నారై దేవయ్య కూడా జిల్లా ప్రజలకు అంతగా పరిచయం లేని వ్యక్తి అంటూ కొత్త పాట అందుకుంది. ప్రతిపక్షాలకు సంబంధించి వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ ఒక్కరే స్థానికుడు కావడం గమనార్హం. -
ఉపసమరానికి దూరం
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు అన్నాడీఎంకే ఉరకలు వేస్తోంది. విపక్షాలు సైతం ఇందుకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీకి దిగరాదని భారతీయ జనతా పార్టీ, డీఎండీకే నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ మినహా అన్ని ప్రధాన పార్టీలు పోటీ నుంచితప్పుకున్నట్లయింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: గతనెల 23న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన జయలలిత ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. తాజా పార్లమెంటు ఎన్నికల తరువాత నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అమ్మపార్టీ సత్తాచూపింది. ఆదాయానికి మించిన కేసులో జయకు జైలుశిక్ష పడిన కారణంగా శ్రీరంగం ప్రాతినిథ్యాన్ని కోల్పోగా ఉప ఎన్నిక జరిగింది. ఆనాటి ఉప ఎన్నికలో అన్ని విపక్ష పార్టీలు పోటీచేసి చతికిలపడ్డాయి. ఈ చేదు అనుభవం నుంచి ప్రతిపక్షాలు బైటపడక ముందే మళ్లీ ఉపఎన్నిక ముంచుకొచ్చింది. జయ అక్రమార్జనే ప్రధాన ప్రచారాస్త్రంగా భావిస్తూ వచ్చిన విపక్షాలకు ఆమె నిర్దోషంటూ కోర్టు ఇచ్చిన తీర్పు గొంతులో వెలక్కాయపడ్డట్టయింది. ఉప ఎన్నికలో అమ్మపై పోటీకి దిగి అప్రతిష్టపాలయ్యే కంటే మిన్నకుండడం మేలని దాదాపుగా అన్ని పార్టీలు నిర్ణయించుకున్నాయి. అందరికంటే ముందుగా అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పోటీకి దూరమని ప్రకటించేసింది. ఆ తరువాత వరుసగా పీఎంకే, ఎండీఎంకే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్కేనగర్లో పోటీకి పెట్టాలని బీజేపీ ఆశించింది. కమలనాథుల కూటమిలో మిగిలిన ఏకైక పెద్దపార్టీ డీఎండీకేతో సంప్రదింపులు జరిపింది. రెండు పార్టీలకు సంబంధించి ఎవరు పోటీకి దిగినా రెండవవారు మద్దతు నిచ్చేలా మాట్లాడుకున్నారు. మరో మూడురోజుల్లో నామినేషన్ల గడువు ముగుస్తున్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఈనెల 6వ తేదీన డీఎండీకే అధినేత విజయకాంత్‌తో సమావేశమయ్యారు. ఈసీ ఏకపక్ష వైఖరి వల్ల దూరం కూటమి పార్టీ పోటీ వద్దనే నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ సైతం విధిలేని పరిస్థితిలో తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందునే పోటీ పెట్టడం లేదని విజయకాంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన శ్రీరంగం, ఏర్కాడు ఉప ఎన్నికల్లో సైతం ఈసీ ఏకపక్షంగా వ్యవహరిం చిందని ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా ఆర్కేనగర్లో సైతం అదే వైఖరిని కొనసాగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఆర్కేనగర్ నియోజకవర్గంలో రోడ్లు వేసి నా, పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చినా ఈసీ నోరుమెదపడం లేద ని ఆయన అన్నారు. పక్షపాతధోరణిలో సాగే ఎన్నికల్లో పోటీచేసేకంటే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఒకేసారి తలపడటమే మేలని బీజేపీ, డీఎండీకే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండురోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నారు. -
అంతటా.. హస్తవాసే
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ప్రాదేశిక సమరం ముగిసింది. మున్సిపల్ ఫలితాల్లో చూపించిన హవానే, ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కొనసాగించింది. అనూహ్యంగా జిల్లా పరిషత్‌ను భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43 చోట్ల విజయభేరి మోగించింది. 13 జెడ్పీటీసీలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. గత జెడ్పీ పాలకమండలిలో ప్రాతినిధ్యం వహించిన సీపీఎం ఈ సారి జెడ్పీలో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయింది. మరో వామపక్ష పార్టీ సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఒక స్థానం గెలుచుకుని జెడ్పీలో ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ తర్వాతి బలమైన పార్టీగా ఉన్న టీడీపీ కేవలం రెండు జెడ్పీటీసీలను గెలుచుకుని సంతృప్తి పడాల్సి వచ్చింది. మొత్తంగా జిల్లా పరిషత్ ఫలితాల్లో కాంగ్రెస్ సంచలన మెజారిటీ సాధించింది. ఎంపీటీసీ స్థానాల విషయంలో వెనుకబడిన టీఆర్ఎస్ మాత్రం జెడ్పీటీసీ స్థానాల విషయంలో రెండంకెల సంఖ్యను చేరుకుంది. ఎస్టీలకు రిజర్వు అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందన్న అంశంపైనే చర్చ జరుగుతోంది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉన్నా, ఆ పార్టీ నాయకత్వం అధికారికంగా ఎక్కడా ఆయన పేరును ప్రకటించలేదు. దీంతో ఇతరుల నుంచి ఏమైనా పోటీ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిషత్ విషయంలో కూడా కాంగ్రెస్ తన పట్టు నిరూపించుకుంది. ఆ పార్టీ ఏకంగా 25 మండల పరిషత్‌లను గెలుచుకునేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సాధించింది. పోటీ ఇస్తుందనుకున్న టీఆర్ఎస్ 3 స్థానాలకు పరిమితం కాగా, టీడీపీ కేవలం 2 చోట్లనే మండలాలను కైవసం చేసుకునేంత మెజారిటీ పొందింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు చతురత చూపారు. జెడ్పీటీసీ స్థానాల విషయంలో 43 చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యం ఇచ్చిన ఓటర్లు మండలాల విషయం వచ్చే సరికి 25 మండలాలకే పరిమితం చేశారు. ఏకంగా 28 మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని కారణంగా హంగ్ ఏర్పడింది. నకిరేకల్ నియోజకవర్గంలో నార్కెట్‌పల్లి మండలాన్ని మినహాయిస్తే మిగిలిన ఐదు మండలాల్లో హంగ్ ఏర్పడడం విశేషం. సూర్యాపేట నియోజకవర్గంలోనూ నాలుగు మండలాలకు రెండు చోట్ల ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి మండలాల్లో జెడ్పీటీసీలను టీఆర్ఎస్ గెలుచుకోగా, ఈ మూడు మండలాలతో పాటు నాంపల్లి మండలాల్లో ఎంపీపీలకు సంబంధించి హంగ్ ఏర్పడింది. తుంగతుర్తి నియోజకవర్గంలో మరీ విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ తిరుమలగిరి మండలంలో స్వతంత్రులే ఎక్కువ స్థానాల్లో గెలిచి మండల పరిషత్‌ను సొంతం చేసుకునేంత మెజారిటీ సాధించా రు. మిగిలిన తుంగతుర్తి, మోత్కూ రు, శాలిగౌరారం, అర్వపల్లి, నూతన్‌కల్ మండలాల్లో ఒక్క చోట కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారి టీ రాక హంగ్ ఏర్పడింది. మొత్తం గా, జిల్లాలో 28 మండలాల్లో ఇదే రకమైన తీర్పు రావడం విశేషం. -
చైర్పర్సన్ రేసులో..
జెడ్పీటీసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగింది. జిల్లాలో 57 స్థానాలుం డగా, టీఆర్ఎస్ 41 సీట్లు గెల్చుకుని సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీ భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమైంది. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జెడ్పీ పీఠాన్ని అధిష్టించే అదృష్టవంతురాలెవరు? అనే విషయంపై ఇటు ప్రజల్లో.. అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, జిల్లా పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. జెడ్పీ చరిత్రలో ఈ సీటు వుహిళలకు రిజర్వు కావటం ఇదే తొలిసారి. అలాగే జిల్లాలోని పన్నెండు జెడ్పీటీసీ స్థానాలు తివ్మూపూర్, రావుడుగు, గంగాధర, ఎలిగేడు, వుల్యాల, రారుుకల్, ధర్మపురి, గొల్లపల్లి, కథలాపూర్, వుల్లాపూర్, కోనరావుపేట, గంభీరావుపేట జెడ్పీటీసీ స్థానాలు బీసీ వుహిళలకు రిజర్వు అయ్యాయి. వురో పన్నెండు స్థానాలు వుుత్తారం, కాటారం, ఎల్లారెడ్డిపేట, వెల్గటూరు, ధర్మారం, వుల్హర్, వూనకొండూరు, చిగురువూమిడి, రావుగుండం, చొప్పదండి, జమ్మికుంట, కవూన్పూర్ బీసీ జనరల్‌కు కేటాయించారు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన స్థానాలతో పాటు బీసీ జనరల్ స్థానాల నుంచి కూడా చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న మహిళలు పోటీకి దిగి గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి చైర్పర్సన్ అభ్యర్థులుగా పార్టీ హామీ ఇచ్చిన, ప్రచారం జరిగిన అభ్యర్థులంతా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే రేసు నుంచి తప్పుకొని కథలాపూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీచేసిన టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ ఆ స్థానం నుంచి గెలుపొందారు. రామడుగు నుంచి వీర్ల కవిత, జూలపల్లి నుంచి ప్రీతి రఘువీర్‌సింగ్, తిమ్మాపూర్ నుంచి ఉల్లెంగుల పద్మ, గంభీరావుపేట నుంచి మల్లుగారి పద్మ విజయం సాధించారు. టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ రావడంతో చైర్పర్సన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పార్టీ అధిష్టానం కనుసన్నల్లో జరగనుంది. చైర్పర్సన్ రేసులో ప్రముఖంగా తుల ఉమ పేరు వినపడుతుండగా, మిగిలిన వారు సైతం అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమం నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన తుల ఉమ.. ఆ తరువాత మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలను అంకితభావంతో నిర్వహిస్తారనే పేరుండటం, వివాద రహితురాలు కావడం, పార్టీ హైకమాండ్‌కు విధేయురాలుగా ఉండటంతో ఆమెకే జెడ్పీ పీఠం దక్కుతుందనే వాదనలు టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తుల ఉమ తరువాతనే తమకు అవకాశం ఉంటుందని చైర్పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థులు చెబుతుండటం విశేషం. -
'హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా'
అనంతపురం జిల్లా హిందూపురం ప్రజలంతా తమ కుటుంబం వంటి వారని ప్రముఖ నటుడు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తెలిపారు. బుధవారం సీమాంధ్రలో ఎన్నికలు ముగిసిన అనంతరం బాలకృష్ణ హిందూపురంలో విలేకర్లతో మాట్లాడారు. హిందూపురంను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. హిందూపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకు తాను పార్టీలో నడుచుకుంటానని చెప్పారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి యువతే ప్రధాన కారణమని బాలకృష్ణ విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
గులాబీ జెండాను రెపరెపలాడిద్దాం
కామారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ : మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుని, గులాబీ జెండాను రెపరెపలాడిద్దామని ఆ పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్‌సింధేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి స మావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని, చైర్మన్ పదవిని దక్కించుకోడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టని షబ్బీర్ అలీ నేడు సంబరాలు, యాత్రలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. 60 యేళ్లగా తెలంగాణ ప్రజలను ఉద్యమకారులను రాచి రంపాన పెట్టి, కాంగ్రెస్ ఓట్లు, సీట్ల కోసమే తెలంగాణ ఇప్పడు ఇచ్చిందని ఆరోపించారు. 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్ననాడు తెలంగాణ ఇచ్చి ఉంటే, 12 వందల మంది అమరులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూస్తుండేవారని అన్నా రు. కాంగ్రెస్ నాయకులు జైత్ర యాత్రలను కాకుండా అమరుల పుణ్యయాత్రలను కొనసాగిస్తే, వారికి పుణ్యమైనా దక్కుతుందన్నారు. ఇక ప్రతీ నియోజక వర్గం లో లక్ష ఎకరాలకు నీరు అందించడం, కేజీ నుంచి పీజీ వరకు కుల, మత భేదాలు లేకుండా ఉచిత విద్యను అందించడం టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి , డీసీఐఎంఎస్ చైర్మన్ ముజిబోద్దిన్ పాల్గొన్నారు. పార్టీలో చేరికలు మాచారెడ్డి మండలంలోని సోమారంపేట మాజీ సర్పంచ్ రాజునాయక్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామాస్తులు టీఆర్ఎస్లో చేరారు. అలాగే పట్టణంలోని పలు వార్డులో కార్యకర్తలు, యువకులు వందలాది సంఖ్యలో చేరారు.