
ఏ ప్రాంతానికీ న్యాయంచేయలేని చంద్రబాబు:కెసిఆర్
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతానికీ న్యాయం చేయలేడని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నారు. రాష్ట్రంలోని అక్రమ ప్రాజెక్టులకు ఆధ్యుడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అని విమర్శించారు. అలాంటి వ్యక్తితో తెలంగాణ అభివృద్ధి సాధ్యంకాదన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు.