నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పాలకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించా రు. పసుపు అధికంగా పండించే నిజామాబాద్ జిల్లాలో పసుపు బో ర్డును ఏర్పాటు చేయలేదన్నారు. నిజామాబాద్ నగరానికి రింగ్ రోడ్డువేసుకొని రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మంగ ళవారం జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన భారత్ విజయయాత్ర బహిరంగసభలో ఆయన మాట్లాడా రు. ఒకప్పుడు బాగా పండిన చెరుకు పంట ఇప్పుడు జిల్లాలో కనిపించడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నా రు. తెలంగాణ అభివృద్ధి చెందుతుం దన్నారు.
యువతకోసం ఎలాంటి స మస్యలనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు. కే సీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం జాతీ య పార్టీలను కలిసి మద్దతు కోరాడ ని, తెలంగాణ వచ్చిన తర్వాత వారి ని తిట్టడం ప్రారంభించాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతి రేకించిన మూడవ ఫ్రంట్‌లో కలుస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. తెలంగాణ వస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చే స్తానని చెప్పిన కేసీఆర్ మాటతప్పాడన్నారు. కాంగ్రెసోల్లు ఓట్లు అడిగితే పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృ ద్ధి చేయనందున ఓటు వేయమని చెప్పాలని సభికులను ఉద్దేశించి అ న్నారు. తెలంగాణలో ప్రత్యేక సదుపాయాలు కావాలనుకుంటే బీజేపీ కే పట్టం కట్టాలన్నారు. ‘నాకు విప్లవ భావాలున్న స్నేహితులున్నారు. వారు నాకెంతో ఇష్టం. చాలా మంది దూరమయ్యారు. కొందరు నేను జనసభ పార్టీ స్థాపిస్తే అది మోడీ సేనా అని అన్నారు. అయినా నేను బాధపడలేదు. దేశ ప్రయోజనాల కోసం మోడీకి మద్దతు తెలుపుతున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రైతాంగాన్ని పట్టించుకోలేదు
Published Wed, Apr 23 2014 2:02 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM