టీఆర్‌ఎస్-కాంగ్రెస్‌కు సీపీఐ మధ్యవర్తిత్వం
హైదరాబాద్: టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదర్చేందుకు సీపీఐ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని కేసీఆర్ పట్టుబడడం, సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. మెజార్టీ అసెంబ్లీ సీట్లు అయినా ఇవ్వాలని టీఆర్‌ఎస్ కోరుతోంది. అది కూడా సాధ్యం కాదని కాంగ్రెస్ చెబుతున్నట్టు తెలిసింది.
రెండు పార్టీలు మెట్టు దిగకపోవడంతో పొత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో టీఆర్ఎస్తో పొత్తు కుదరడం సాధ్యం కాకపోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు అంటున్నారు. అయితే టీఆర్ఎస్తో పొత్తుకు తలుపులు తెరుకునే ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.