తెలంగాణలో ఎంఐఎం, సీపీఐలపై కాంగ్రెస్ గురి!
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఎంఐఎం, సీపీఐలపై కాంగ్రెస్ గురిపెట్టింది. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అనే పరిస్థితిలో ఎన్నికల జరిగాయి. ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదురుగాలి వీచినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
తెలంగాణ ప్రాంతంలో మెజార్టీ సీట్లు లభించకపోతే ఎంఐఎం, సీపీఐలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లభిస్తుందనే విషయంలో ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు లేవని ఆయన అన్నారు.
ఒకవేళ మెజార్టీకి సీట్లు తగ్గితే ఎంఐఎం, సీపీఐలతో కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉందన్నారు.