డీఎస్ అయిదోసారి ఓడిపోయారు
నిజామాబాద్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మరోసారి ఓటమి చవిచూశారు. ఆయన తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్పై 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందారు. కాగా 1994లో ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్థన్ 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2004 లో గోవర్థన్ బాన్‌సవాడ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరి నిజామాబాద్ రూరల్ నుంచి బరిలోకి దిగారు.
ఇక డీఎస్ ఓటమిని హ్యాట్రిక్ అనే చెప్పుకోవచ్చు. రెండుసార్లు ఓటమితో డీ శ్రీనివాస్ ఏకంగా నిజామాబాద్ అర్భన్ సెగ్మెంట్ నుంచి రూరల్కు మారినా ఫలితం మాత్రం వెంటాడింది. 1983, 1994, 2009, 2010, 2014 ఎన్నికల్లో డీఎస్ను ఓడించి ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. అప్పట్లో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న డీఎస్కు ఓటర్లు రెండుసార్లు ఓటమి రుచి చూపించారు. ఆయన జనంలో అంతగా గుర్తింపులేని బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోవడం అప్పట్లో సంచలనం. 2004 నుంచి కాంగ్రెస్ లో కీలకమైన పదవులు నిర్వహించిన డీఎస్ వరుసగా ఓటమి పాలు కావటంతో దాదాపు ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందనే చెప్పుకోవచ్చు.
డీ శ్రీనివాస్, డీఎస్, నిజామాబాద్, బాజీరెడ్డి గోవర్థన్, టీఆర్ఎస్, కాంగ్రెస్, D srinivas, DS, nizamabad, bajireddy govardhan, trs, congress