వైఎస్సార్ సీపీ బాపట్ల లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ అమృతపాణి
నగరం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందిం చిన మేనిఫెస్టో అభివృద్ధి, సంక్షేమానికి రెండు కళ్లలా ఉందని వైఎ స్సార్ సీపీ బాపట్ల లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ వరికూటి అమృతపాణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరం మండలంలో రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణారావుతో కలిసి ఆయన బుధవారం పర్యటించారు. అమృతపాణి మాట్లాడుతూ వైఎ స్సార్ మరణానంతరం రాష్ట్రంలో పాలన గాడితప్పిందన్నారు. ప్రజా సంక్షేమానికే దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం, పాలకులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరిన జననేత జగన్‌పై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్భందించారని చె ప్పారు. కుట్రలో భాగంగా మోపిదేవిని బలిపశువును చేసి రెండేళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారన్నారు. జైల్లో ఉన్నా జననేత జగన్, మోపిదేవి వెంకటరమణారావు ప్రజా సంక్షేమం కోసమే నిరంతరం పరితపించారని చెప్పారు.
ప్రజల కష్టాలను తీర్చి సువర్ణయుగాన్ని అందించేందుకు జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో అమ్మబడి పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని చెప్పారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలో ఈ పథకం ద్వారా నెలకు రూ. 700 నుంచి రూ. 1000 వరకు జమ చేయనున్నట్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను రూ.700కు, వికలాంగులకు ఇస్తున్న రూ. 500ను రూ.1000కి పెంచుతామన్నారు. మహిళాలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి వడ్డీలేని రుణాలను అందిస్తానని జగనన్న ఇప్పటికే ప్రకటించారని వివరించారు. బాపట్ల పార్లమెంట్ నుంచి తనను గెలిపిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి లోక్‌సభలోని నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి జననేతను సీఎం చేయాల్సిన బాధ్యత మీదేనని అన్నారు.
మేనిఫెస్టో అభివృద్ధి, సంక్షేమానికి రెండు కళ్లు
Published Thu, May 1 2014 1:47 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement