ప్రజల గుండెల్లో ‘ఫ్యాన్’ | 'Poor people's heart beat is YSRCP manifesto | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో ‘ఫ్యాన్’

Published Sun, Apr 27 2014 2:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ప్రజల గుండెల్లో ‘ఫ్యాన్’ - Sakshi

ప్రజల గుండెల్లో ‘ఫ్యాన్’

 రణస్థలం, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తు ‘ఫ్యాన్’ప్రజల గుండెల్లోకి బాగా చొచ్చుకుపోయిందని ఇక విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు విజయచందర్ అన్నారు. ఎన్నిక ల ప్రచారంలో భాగంగా రణస్థలంలో శనివారం ఆయన ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి పల్లె నుంచి పట్టణం వరకు తిరుగుతున్నానని, ఎక్కడ చూసినా పిల్లలు నుంచి ముసలి వారు వరకు ఫ్యాన్ గుర్తును చూపిస్తూ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో హస్తం, సైకిల్ గుర్తు ప్రజల్లో ఉండేదని ప్రస్తుతం ఫ్యాను గాలికి అవి కొట్టుకుపోయాయని విజయచందర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువనాయకుడి అవసరం ఎంతో ఉందని, అందుకే జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని విజయచందర్ అన్నారు.
 
 అనంతరం సూపర్‌స్టార్ కృష్ణ-మహేష్ అభిమాన సంఘ గౌరవ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు. అలాగే సూపర్‌స్టార్ కృష్ణ,-మహేష్‌బాబు అభిమానులు వైఎస్సార్‌సీపీ విజయానికి సహకరించాలని కోరారు.  మొదటి నుంచి మా కుటుంబమంతా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వెనుకాల ఉండేవారమని, అందుకే ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్ వెనుకాల ఉంటున్నట్లు తెలిపారు. సినిమాల్లో మహేష్‌బాబు నంబర్‌వన్ డేరింగ్ హీరో అని, రాజకీయంలో జగన్ నంబరు వన్ డేరింగ్ నాయకుడని అన్నారు. కార్యక్రమల్లో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు టోంపల సీతారాముడు, గొర్లె సన్యాసప్పలనాయుడు, గొర్లె రాధా, కరిమజ్జి భాస్కరరావు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement