
శ్రీముఖలింగంలో ప్రచారం చేస్తున్న యువనాయకులు
జలుమూరు, న్యూస్‌లైన్: మండలంలో యువనాయకుల ప్రచారం జోరందుకుంది. యువనాయకత్వాన్ని సమర్ధించాలని, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయూలంటూ శ్రీముఖలింగం, కరకవలస, కరకవలస కాలనీతో పాటు పలుగ్రామాలో నరసన్నపేట వైఎస్సార్ సీపీ ఎమ్మేల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి రెండి శాంతికి ఓటేయూలంటూ ఓటర్లను అభ్యర్థించారు.
రెడ్డి శాంతి తనయడు రెడ్డి శ్రావణ్‌కుమార్, కృష్ణదాస్ తనయుడు ధర్మా రామలింగంనాయడు, మాజీ ఎంపీపీలు బగ్గు రామకృష్ణ, వెలమల కృష్ణారావు కొడుకులు బగ్గు గౌతమ్, వెలమల రాజేంద్రతో పాటు యవసర్పంచ్‌లు కనుసు రవి, పైడి విఠలరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కన్వీనర్ ధర్మాన ప్రసాద్‌లు కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. జగన్ సీఎం అరుుతే ఒనగూరే ప్రయోజనాలను తెలియజేశారు. నేతల తనయులు ప్రచారానికి రావడంతో గ్రామాల్లో సందడి వాతావరణ నెలకొంది. అడుగడుగునా ప్రజలు వీరికి స్వాగతం పలికారు. జగన్ వెంటనే ఉంటామంటూ భరోసా ఇచ్చారు.