మోడీపై పోటీకి నేనా.. అబ్బే తెలీదు!! | Digvijay singh 'unaware' of pitching him against narendra modi | Sakshi
Sakshi News home page

మోడీపై పోటీకి నేనా.. అబ్బే తెలీదు!!

Published Thu, Mar 20 2014 5:21 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

మోడీపై పోటీకి నేనా.. అబ్బే తెలీదు!! - Sakshi

మోడీపై పోటీకి నేనా.. అబ్బే తెలీదు!!

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై పోటీ అనగానే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ భయపడుతున్నట్లు ఉన్నారు. వారణాసిలో మోడీపై పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డిగ్గీరాజాను బరిలోకి దింపుతున్నట్లు మీడియాలో కథనాలు రావడంతో.. ఆయన స్పందించారు. అసలు తనకు ఆ విషయమే ఇంతవరకు తెలియదని దిగ్విజయ్ అన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా మోడీని ఢీకొట్టే సత్తా కాంగ్రెస్ పార్టీలో ఎవరికుందన్న ప్రశ్న వచ్చినప్పుడు.. దానికి దిగ్విజయే తగిన అభ్యర్థి అని పార్టీ వర్గాలు అన్నాయి. కానీ, తనకు ఆ విషయమే తెలియదని, దాని గురించి ఇంతవరకు ఎవరూ తనతో ఏమీ మాట్లాడలేదని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కాగా,  మోడీని ఢీకొనడానికి తాను సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ముందుకొచ్చారు. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని సిద్ధం చేయలేకపోయిందని దీన్నిబట్టి తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement