మోడిపై పోటీకి సై అంటున్న దిగ్విజయ్‌ | Digvijay Singh Offers to contest against Narendra Modi from Varanasi | Sakshi
Sakshi News home page

మోడిపై పోటీకి సై అంటున్న దిగ్విజయ్‌

Published Wed, Mar 19 2014 6:48 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

మోడిపై పోటీకి సై అంటున్న దిగ్విజయ్‌ - Sakshi

మోడిపై పోటీకి సై అంటున్న దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఢీకొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సిద్దమవుతున్నారు. వారణాసిలో మోడీపై పోటీ చేసేందుకు ఆయన అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని అధిష్టానంతో ఆయన చెప్పినట్టు తెలిసింది. దిగ్విజయ్‌ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మోడీకి ఆయన దీటైన అభ్యర్థి కాగలని అధిష్టానం భావిస్తోంది.

వారణాసి నుంచి నరేంద్రమోడీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి హస్తం తరఫున ఎవరు బరిలో దిగుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు. వారణాసి నుంచి ప్రముఖ వ్యక్తినే రంగంలోకి దింపనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఈనేపథ్యంలో దిగ్విజయ్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement