చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దని, అది దొంగల పార్టీ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ఆరోపించారు. ఆదివారం ఆమె మండలంలోని శేరిపల్లి, మిర్జాపల్లి, టి.మాందాపూర్, జంగరాయి,ధరిపల్లి, చిన్నశంకరంపేట, కామారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో ఇచ్చిన మాటపై నిలబడే వారు లేరన్నారు. మాట మీద నిలబడని వారితో తెలంగాణ పునర్నిర్మాణం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
కాగా శేరిపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి చెప్యాల స్వాతి తమ మద్దతుదారులతో కాంగ్రెస్‌లో కలిశారు. టి.మాందాపూర్‌లో టీడీపీ నాయకులు మల్కాగౌడ్, యాదగిరిగౌడ్, జంగరాయిలో టీడీపీ సర్పంచ్ వడ్ల శోభ, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, చంద్రారెడ్డిలు తమ మద్దతుదారులతో కాంగ్రెస్‌లో చేరారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఏఏంసీ చైర్మన్ రమణ, తిరుపతిరెడ్డి, శ్రీమన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రామకిష్టయ్య, ఆకుల రాములు, శేరిపల్లి సర్పంచ్ పద్మ, గొండస్వామి పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు
Published Mon, Apr 28 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement
Advertisement