ఎగ్జిట్‌పోల్ సర్వేలపై ఈసీ నిషేధం
ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకూ అమలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. తొలి దశ పోలింగ్ ప్రారంభమయ్యే ఏప్రిల్ 7 నుంచి చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగిసే మే 12 వరకూ ఈ నిషేధం అమలులో ఉండనుంది.
ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మే 12వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్‌పోల్స్‌ను ఏ పద్ధతిలోనైనా ముద్రించడంగానీ, ప్రసారంగానీ, ప్రచారంగానీ నిషేధిస్తున్నట్టు స్పష్టంచేసింది. ఈ నిషేధం అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందు నుంచి ఒపీనియన్ పోల్ సర్వేల ఫలితాలు ప్రకటించడంపైనా ఈసీ నిషేధం విధించింది.