'పగ' వ్యాఖ్యలపై అమిత్ షాకు ఈసీ నోటీసులు | ec issues notices to amit shah over revenge comments | Sakshi
Sakshi News home page

'పగ' వ్యాఖ్యలపై అమిత్ షాకు ఈసీ నోటీసులు

Published Mon, Apr 7 2014 4:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'పగ' వ్యాఖ్యలపై అమిత్ షాకు ఈసీ నోటీసులు - Sakshi

'పగ' వ్యాఖ్యలపై అమిత్ షాకు ఈసీ నోటీసులు

పగ తీర్చుకోవాలంటే ఓట్లేయండి అంటూ బీజేపీ నాయకుడు అమిత్్ షా చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ అమిత్ షాకు ఈసీ నోటీసులిచ్చింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేలాగే ఉన్నాయని ఈసీ భావించింది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహతుడైన అమిత్ షా.. ముజఫర్నగర్ నియోజకవర్గంలో ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లు రుజువైతే ఆయనపై చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ తెలిపారు. అమిత్ షాపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలైందని, తాము చర్య తీసుకోడానికి ముందు ఆ సీడీలు పరిశీలిస్తామని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement