సతీ సమేతంగా ఓటు వేసిన తొలి ఓటరు
కల్ప : భారతదేశ తొలి ఓటరు శ్యామ్ నేగి (97) సతీ సమేతంగా ఎనిమిదో విడత పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఆయన కల్పలో భార్యతో కలిసి ఓటు వేశారు. ఇప్పటివరకు 15 లోక్‌సభ ఎన్నికలతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ శ్యామ్ నేగి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటేసినవారు ఇంకా ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకత ఆయనదే.. ఎందుకంటే భారతదేశ తొలి ఓటరు ఆయనే..
దాంతో 1951లో తొలిసారిగా జరిగిన లోక్‌సభ ఎన్నికల దగ్గరనుంచి ఇప్పటివరకు జరిగిన మొత్తం 16 సార్వత్రిక ఎన్నికల్లోనూ శ్యామ్ నేగి ఓటు వేయటం విశేషం. దాంతో ఆయనను రాష్ట్ర ఎన్నికల సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా శ్యామ్ నేగి మాట్లాడుతూ 97 ఏళ్ల తానే ఓటు హక్కు వినియోగించుకున్నానని, ప్రజలందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా శ్యామ్ నేగి జూలై ఒకటో తేదీన 98వ ఏట అడుగుపెట్టనున్నారు.