ముస్లిం వ్యతిరేకి బీజేపీతో పొత్తే అందుకు నిదర్శనం
ఆ రెండు పార్టీల బంధంపై మైనార్టీల ఆగ్రహం
వైఎస్ జగన్ వస్తేనే చట్టబద్ధత ఉంటుందని నమ్మకం
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ఎన్నికలొస్తే ‘ఆస్సాలాము అలైకుమ్ భాయ్.. అచ్చహై.. హమారే నిషానికో ఓట్ దేనా.. హమారీ పార్టీ జీత్ గయాతో సబ్ కుచ్ కరేంగే’. (నమస్తే అన్నా. బాగున్నావా, మా గుర్తుకు ఓటేయండి. మాపార్టీ వస్తే అన్ని చేస్తాం) అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న నేతలు మళ్లీ ఎన్నికల వరకు కనిపించడం లేదు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం మాటమీద నిలిచారు. ముస్లింల వెనుకబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత అభివృద్ధి చిత్తశుద్ధితో కృషి చేశారు. తాయిలాలు కాకుండా రిజర్వేషన్లతో జీవితాన్నిచ్చారు. ఈ మేరకు హామీ ఇచ్చి ఆచరణలో పెట్టారు.
ఆయితే ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల అమలుకు అసలు పరీక్ష మొదలైంది. ఆరేళ్లుగా అనేక ఒడుదుడుకుల మధ్య అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్ల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్లు కనుమరుగవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రిజర్వేషన్ల ప్రదాత వైఎస్సార్: ముస్లింల వెనుకబాటును గుర్తించిన మహానేత వైఎస్సార్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. విద్య, ఉపాధి, ఉద్యోగ, పదోన్నతుల్లో వీటిని అమలు చేస్తూ జీఓ నంబర్ 23ను జారీ బీసీ-ఈ కేటగిరిలో 5శాతం ఆచరణలో పెట్టారు. అయితే బీజేపీ, ఇతర సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో ఆగిపోయాయి. తర్వాత వైఎస్సార్ 2007లో ఆర్డినెన్స్ ద్వారా మళ్లీ అమల్లోకి తెచ్చారు.
ఇష్టం లేనివారు మరోసారి హైకోర్టుకు వెళ్లడంతో జస్టీస్ దావే ధర్మాసనం ఆదేశాలతో రిజర్వేషన్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుపై వైఎస్సార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్న షరతుతో గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ మేరకు మహానేత ముస్లిం రిజర్వేషన్లను 4శాతానికి కుదించి అమలులోకి తెచ్చారు.
అయితే ఆయన మరణం త ర్వాత రిజర్వేషన్లకు ఆటంకాలు అధికమయ్యాయి. 2010 ఫిబ్రవరి 8న సుప్రీంకోర్టు రిజర్వేషన్ల రద్దుకు మళ్లీ ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం, ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లి అదే సంవత్సరం మే 19న కోర్టు నుంచి స్టే ఇవ్వడంతో కొనసాగుతున్నాయి. స్టే మేరకు అమలవుతున్న వీటిని మరో పదేళ్లు కొనసాగించనున్నట్లు గత ప్రభుత్వం 2012 జూన్‌లో జీఓ ఎంఎస్ 9ను జారీ చేసింది.
చంద్రబాబు ఆయాతో.. బీసీ-ఈ ‘గాయ’బ్
Published Mon, Apr 14 2014 3:32 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement