వాట్సాప్ తలాక్‌పై స్పందించిన హైకోర్టు
- బాధిత మహిళల పిటిషన్ విచారణకు స్వీకరణ
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ ద్వారా విడాకులు పంపిన భర్తలపై వారి భార్యలు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచార ణకు స్వీకరించింది. అక్రమ మార్గాల ద్వారా పంపే తలాక్ ల నుంచి అమాయక ముస్లిం మహిళలను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, వక్ఫ్‌బోర్డ్ సీఈవో, తలాక్ పంపిన ఉస్మాన్ ఖురేషీ, ఫయాజుద్దీన్ ఖురేషీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వ రరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. అక్రమ మార్గా ల ద్వారా పంపే తలాక్‌ల విషయంలో తగిన మార్గదర్శకాలను రూపొం దించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిం చాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మెహరీన్ నూర్, సయ్యదా హీనా ఫాతిమా హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం. ఎ.ముకీద్ వాదనలు వినిపిస్తూ...ఎలా పడితే అలా తలాక్ ఇవ్వడానికి లేదని, ఇదే విషయా న్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు.
అక్రమ తలాక్ లతో అమాయక ముస్లిం మహిళలు అన్యాయ మైపోతున్నారని విన్నవించా రు. వక్ఫ్‌బోర్డు తరఫు న్యాయవాది స్పంది స్తూ...ఇలాంటి వ్యవహారాల్లో లా కమిషన్ నుంచి కేంద్రం సిఫారసులు కోరిందని, దీంతో లా కమిషన్ ప్రజల అభిప్రాయాలు అడిగింద ని తెలిపారు. వ్యవహారం లా కమిషన్ పరిధి లో ఉన్నప్పుడు ప్రస్తుతం తాము ఆదేశాలు జా రీ చేయడం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కనీసం పిటిషనర్లకు రక్షణయినా కల్పించాలని, ఆ మేర పోలీసులను ఆదేశిం చాలని వారి న్యాయవాది కోరారు. ఈ విషయంలో పిటిషనర్లకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని న్యాయమూర్తి తెలిపారు.