హైదరాబాద్‌లోని పాతబస్తీ అభివృద్ధిపై నిజాం కాలం తర్వాత శ్రద్ధ చూపిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కుతుంది. ఆయన హయాంలో ప్రత్యేక ప్యాకేజీ కింద సుమారు రూ.2024.65 కోట్లను మంజూరు చేశారు. రోడ్లు, నీటిసరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, నీటి ట్యాంకులు, షాదీఖానాలు, మసీదులు, ఆషూర్ ఖానాల మరమ్మతు వంటి అనేక పనులు చేపట్టారు. మీరాలం సీవరేజ్ ప్లాంట్, చందులాల్ బారాదరి, కాటేదాన్, రియాసత్ నగర్, మిధానిల్లో స్పోర్ట్స్ కాంపెక్ల్స్, ఇమ్లీబన్ పార్క్, ఫలక్‌నుమా సిటీ బస్ టెర్మినల్, చాంద్రాయణ గుట్ట ఫై ్ల ఓవర్ తదితర నిర్మాణాలు పూర్తి చేయించారు.
ముస్లిం విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ సిలబస్‌తో దక్షిణ భారత దేశంలోనే ప్రప్రథమంగా మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఇమామ్‌లకు వేతనాలిచ్చే ప్రక్రియను ప్రారంభించారు. మాజీ సైనికుల నివాస గృహాలు, 40 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కోల్డ్‌స్టోరేజీ, స్లాటర్ హౌస్ సమస్యలను పరిష్కరించగలిగారు. పలు సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తెచ్చారు. వైఎస్సార్ మరణానంతరం పాతబస్తీ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థ (కుడా)కు రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన తాజా మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి.. తర్వాత గాలికొదిలేశారు. దీంతో పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయి.