మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు | I would have sent Modi to jail had I been in Delhi: Mamata Banerjee | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Published Fri, May 9 2014 7:26 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు - Sakshi

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

బెర్హంపూర్: నరేంద్ర మోడీని చూసి కాంగ్రెస్ భయపడుతోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా వ్యహరించే ధైర్యం కాంగ్రెస్కు లేదని ఎద్దేవా చేశారు. బీజేపీతో కుమ్మక్కయి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఉనికి కోసం బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని దుయ్యబట్టారు.

తాను ఢిల్లీలో ఉంటే నరేంద్ర మోడీనికి జైలుకు పంపేదాన్నని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బదులు కేంద్రంలో తాను అధికారంలో ఉండే మోడీకి ఈపాటికి జైల్లో ఉండేవారని అన్నారు. ముర్షిదాబాద్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో మోడీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలుంటే మద్దతివ్వబోమని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement