అమ్మ మాట..
ఏడాదికోసారైనా అమరులను తలచుకోవాలి
తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల జ్ఞాపకార్థం ప్రభుత్వమే విగ్రహాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలి. వారి కుటుంబాలకు బస్సు, రైలు పాస్‌లు అందజేయాలి. ఏడాదికోసారి అమరుల జ్ఞాపకార్థం సభలు, సమావేశాలు నిర్వహించి నివాళులర్పించాలి. అప్పుడే నాలాంటి తెలంగాణ అమరవీరుల తల్లులకు మనశ్శాంతి లభిస్తుంది. నవ తెలంగాణలో ప్రభుత్వమే ప్రతీ పేదకీ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. కొత్త రాష్ట్రంలో లంచాలనే మాట వినిపించకుండా చేయాలి.
అందరూ కష్టపడి కొత్త రాష్ట్రం నిర్మాణంలో పాలుపంచుకోవాలి. పేద విద్యార్థులుకు నాణ్యమైన విద్య అందించే ఏర్పాట్లు చేయాలి. చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం కల్పించాలి. రేషన్‌షాపుల ద్వారా ప్రతీ ఒక్కరికీ నెలకు 15కిలోల బియ్యం పంపిణీ చేయాలి. అలాగే తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలి. పేదలు పెద్దాస్పత్రులకు వెళ్లలేక తనువు చాలిస్తున్నారు. ఈ దుస్థితి ప్రత్యేక రాష్ట్రంలో తలెత్తకుండా అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీల ఆస్తులు పెరిగితే వారిని అనర్హులుగా ప్రకటించాలి.
-న్యూస్‌లైన్, ఇల్లెందు