సాలూరు, న్యూస్‌లైన్: సాలూరు నియోజకవర్గంలోని టీడీపీలో అంతర్గత పోరు నెలకొంది. ఇన్నాళ్లూ అంతా సవ్యం గానే ఉందనుకున్న నేతల మధ్య విభేదాలు ఇప్పు డు బయటపడుతున్నాయి. సాలూరు అసెంబ్లీ టిక్కెట్‌ను ఆర్‌పీ భంజ్‌దేవ్‌కు కేటాయించడంతో సంధ్యారాణి వర్గీయులు భగ్గుమంటున్నారు. గత ఎన్ని కల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైనప్పటి నుంచీ ఈసారి కూడా సాలూరు అసెంబ్లీ అభ్యర్థివి నువ్వే...కష్టపడి పని చేయని చెబుతూ వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు ఆఖరు నిమిషంలో మొండిచేయి చూపడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్టీ కోసం కష్టపడి పని చేసిన ఆమెను కాదని, చివరి నిమిషంలో భంజ్‌దేవ్‌కు ఎందుకు టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. అయితే సంధ్యారాణికి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే.. పార్టీలో ఉంటూ మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్ ఆమె గెలుపునకు ఎట్టి పరిస్ధితుల్లోనూ సహకరించరని, అందువల్లే ఆయనకు టిక్కెట్ ఇచ్చినట్టు నేతలు చెబుతున్నారు. అందుకే భంజ్‌దేవ్‌కు సాలూరు అసెంబ్లీ స్థానాన్ని, సంధ్యారాణికి ఎంపీ టిక్కెట్ ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. కానీ పార్టీలో ఎవరిని కదిపినా.. సంధ్యారాణికి అన్యా యం జరిగిందనే అంటున్నారు. ఐదేళ్ల పాటు పార్టీ ని నడిపించిన ఆమే గెలవకుంటే.. భంజ్‌దేవ్ ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీలో అంతర్గత పోరు!
Published Thu, Apr 17 2014 2:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement