ఇంతే ఖర్చు పెట్టారట..!
* భారీ ఎత్తున ప్రచారం
* ఎన్నికల వ్యయం మాత్రం బహు స్వల్పం.. ఇదీ అభ్యర్థుల లెక్క
సాక్షి, సిటీబ్యూరో : మైకుల హోరు.. జెండాల జోరు.. లెక్కలేనన్ని కటౌట్లు.. వందలాది వాహనాలు.. ఖరీదైన ప్రచార రథం.. వెంట అనుచరగణం.. రోడ్ షోలు.. భారీ బహిరంగ సభలు.. ‘బహు’మతుల పంపకం.. నోట్ల కట్టల ప్రవాహం.. ఏరులై పారిన మద్యం.. ఇదీ సార్వత్రిక ఎన్నికల సీన్. ఏ లోక్‌సభ నియోజకవర్గం చూసినా.. ఎలాంటి అభ్యర్థి అయినా తార స్థాయి ప్రచారం.. పెద్ద ఎత్తున పబ్లి‘సిటీ’ కామన్‌గా కనిపించింది. వెరసి అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు రూ.కోట్లు ఖర్చు పెట్టారు.
కానీ వారిని ఎన్నికల వ్యయం గురించి అడిగితే మాత్రం ‘అబ్బే.. మేమేం ఖర్చు చేయలేద’ంటున్నారు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయంగా రూ.70 లక్షలు ఖర్చు చేసుకునే సౌలభ్యాన్ని ఎన్నికల సంఘం కల్పించినా.. మాకంత సీన్ లేదంటున్నారు. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల రోజు వరకు తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయాలివీ...