ఎవరికి వారే ఎలక్షన్ తీరే! | khadar rana has to battle with wife | Sakshi
Sakshi News home page

ఎవరికి వారే ఎలక్షన్ తీరే!

Published Wed, Mar 19 2014 6:36 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

khadar rana has to battle with wife

'ఎక్కడైనా బావ అంటే ఒప్పుకుంటాను. కానీ వంగతోట కాడ మాత్రం ఒప్పుకోను' ఇది పాత సామెత. ఇప్పుడు ఇది మారి  'ఎక్కడన్నా భార్య అంటే ఒప్పుకుంటాను. ఎన్నికల వేళ మాత్రం భార్యా భర్తా జాన్తానై' అయిపోయింది. 'ఎవరికి వారే ఎలక్షన్ తీరే' మరి! ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ లోకసభా స్థానానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ ఖాదర్ రాణా పోటీ చేస్తున్నారు.

ఆయనకు పోటీగా ఆయన భార్య షాహిదా బేగమ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. రాణా గారు గతంలో సమాజ్ వాదీ పార్టీలో ఉండేవారు. 2007 లో ఆయన రాష్ట్రీయ లోకదళ్ లో చేరారు. రెండేళ్లకే బీఎస్పీ బాగుందని వచ్చేశారు. ప్రస్తుతం ముజఫర్నగర్ అల్లర్లలో ఆయనపై చార్జిషీటు కూడా దాఖలైంది. కానీ ఆయనకు కూడా ఇంతిపోరు తప్పడం లేదు. భార్యామణి బరిలో దిగేసరికి ఆయన కంగారు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement